MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jenelia-second-innings2883f87d-9510-40b5-a549-83fd1133a10a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jenelia-second-innings2883f87d-9510-40b5-a549-83fd1133a10a-415x250-IndiaHerald.jpg"తుజే మేరి కసం" అనే హిందీ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జెనీలియా... తెలుగులో సత్యం చిత్రంతో తెరంగ్రేటం చేసింది. క్యూట్ నవ్వుతో, మత్తెక్కించే కళ్ళతో ప్రేక్షకుల మనసును కొల్ల గొట్టిన ఈ ముంబై భామ... బొమ్మరిల్లు చిత్రంతో యువత పెదవులపై మెరిసే హాసినిగా మారిపోయింది. ఈ చిత్రంతో ఆమె ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. JENELIA-SECOND INNINGS;bhama;jeevitha rajaseskhar;jyothika;satya;mumbai;bollywood;tollywood;cinema;telugu;tamil;marriage;kannada;hindi;comedy;hero;heroine;yuva;santosham;anandam;chitramపెళ్ళై పిల్లలున్న ఈ అందాల భామ హీరోయిన్ గా అలరిస్తుందా...?పెళ్ళై పిల్లలున్న ఈ అందాల భామ హీరోయిన్ గా అలరిస్తుందా...?JENELIA-SECOND INNINGS;bhama;jeevitha rajaseskhar;jyothika;satya;mumbai;bollywood;tollywood;cinema;telugu;tamil;marriage;kannada;hindi;comedy;hero;heroine;yuva;santosham;anandam;chitramSun, 25 Apr 2021 12:00:00 GMT"తుజే మేరి కసం" అనే హిందీ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జెనీలియా... తెలుగులో సత్యం చిత్రంతో తెరంగ్రేటం చేసింది. క్యూట్ నవ్వుతో, మత్తెక్కించే కళ్ళతో ప్రేక్షకుల మనసును కొల్ల గొట్టిన ఈ ముంబై భామ... బొమ్మరిల్లు చిత్రంతో యువత పెదవులపై మెరిసే హాసినిగా మారిపోయింది. ఈ చిత్రంతో ఆమె ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. రెడీ, ఢీ , సై, హ్యాపీ వంటి సూపర్ హిట్ చిత్రాలు జెనీలియా క్రేజ్ ను మరింత పెంచాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో తనదైన శైలిలో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది ఈ అందాల భామ హాసిని. అయితే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే... బాలీవుడ్ యువ కథానాయకుడు రితేష్ దేశ్ ముఖ్ ని 3 ఫిబ్రవరిన 2012 లో వివాహం చేసుకొని కెమెరాకు ప్యాకప్ చెప్పింది.

బాలీవుడ్‌ అడల్ట్‌ కామెడీ హీరోగా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ప్రముఖ హీరోగా కొనసాగుతున్నారు, యాక్షన్ చిత్రాలతోనూ హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ కుర్ర హీరో. పెళ్లి తర్వాత... తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న జెనీలియా... ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వారి ఆలనాపాలనా.. కుటుంబ బాధ్యతతో ఆనందంగా గడుపుతున్న జెనీ ఇప్పుడు పిల్లలు కాస్త పెద్ద కావడంతో.. తిరిగి కెమెరా ముందుకు రావాలి అనుకుంటోందట. అది కూడా తనను ఎంతగానో ఆదరించిన టాలీవుడ్ లోనే రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందట. మంచి కాన్సెప్ట్ కనుక దొరికితే తిరిగి వెండితెరపై కనిపించాలని ఆశపడుతోందట మన హాసిని.

అయితే జెనీలియా కు తగ్గ పాత్ర, కథతో ఏ దర్శకుడు ఆమెను తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి. అయితే ఇప్పటికే ఎంతోమంది పెళ్లి అయిన తరువాత తిరిగి సినిమా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో జ్యోతిక ఉన్నారు. అయితే జ్యోతిక హీరోయిన్ పాత్రలో కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుని ముందుకు వెళుతోంది. అయితే జెనీలియా ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్ గా ఆకట్టుకుంటుందా చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ విషయంలో జగన్ పట్టుదల చూపిస్తే నష్టపోతారా...?

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>