Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund5ad4ebf-375d-4e98-9a62-88d67349e966-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund5ad4ebf-375d-4e98-9a62-88d67349e966-415x250-IndiaHerald.jpgఓ లాంగ్వేజ్‌లో విడుదలైన సినిమాలు మరో భాషలోకి డబ్బింగ్ కావడం షరామామూలే. హిందీ సినిమాలు తెలుగులోకి, తెలుగు సినిమాలు తమిళంలోకి, తెలుగు సినిమాలు మళయాళంలోకి.. ఇలా ఓ భాషలోని సినిమాలు వేరే భాషలోకి డబ్బింగ్ అయి విడుదలవుతుంటాయి. కొన్ని సార్లు ఒరిజినల్ లాంగ్వేజ్‌తో సరిసమానంగా అక్కడ కూడా హిట్ అవుతుంటాయి. అయితే మరికొన్ని సార్లు ఒరిజినల్..ALLU ARJUN;view;kumaar;pooja hegde;allu arjun;sukumar;india;tollywood;cinema;telugu;tamil;hindi;blockbuster hit;duvvada jagannadham;arjun 1ఇక్కడ ప్లాప్ అయినా.. డబ్బింగ్‌లో అక్కడ సెంచరీ కొట్టిన బన్నీ మూవీఇక్కడ ప్లాప్ అయినా.. డబ్బింగ్‌లో అక్కడ సెంచరీ కొట్టిన బన్నీ మూవీALLU ARJUN;view;kumaar;pooja hegde;allu arjun;sukumar;india;tollywood;cinema;telugu;tamil;hindi;blockbuster hit;duvvada jagannadham;arjun 1Sat, 24 Apr 2021 13:57:18 GMTఇంటర్నెట్ డెస్క్: ఓ లాంగ్వేజ్‌లో విడుదలైన సినిమాలు మరో భాషలోకి డబ్బింగ్ కావడం షరామామూలే. హిందీ సినిమాలు తెలుగులోకి, తెలుగు సినిమాలు తమిళంలోకి, తెలుగు సినిమాలు మళయాళంలోకి.. ఇలా ఓ భాషలోని సినిమాలు వేరే భాషలోకి డబ్బింగ్ అయి విడుదలవుతుంటాయి. కొన్ని సార్లు ఒరిజినల్ లాంగ్వేజ్‌తో సరిసమానంగా అక్కడ కూడా హిట్ అవుతుంటాయి. అయితే మరికొన్ని సార్లు ఒరిజినల్ లాంగ్వేజ్‌ను మించి కూడా హిట్ అవుతుంటాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కూడా అలాంటి రికార్డే సృష్టించింది. టీవీల్లో విడుదలైనప్పటికీ.. యూట్యూబ్‌లో ఉంచిన డబ్బింగ్ వెర్షన్‌కు ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం నార్త్ ఇండియాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు అర్జున్‌ నటించిన పాత సినిమాలు అన్ని కూడా హిందీలో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. హిందీ భాషలో శాటిలైట్ రైట్స్ ద్వారా విడుదల అయిన బన్నీ సినిమాలు వందల మిలియన్ వ్యూస్‌‌ దక్కించుకుంటున్నాయి. అయితే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచిన మూవీస్ అక్కడ భారీగా యూట్యూబ్‌ వ్యూస్ దక్కించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ నటించిన ఓ ప్లాప్ సినిమా కూడా ఇప్పుడు మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అల్లు అర్జున్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన డీజే సినిమా హిందీలో డబ్బింగ్‌ అయ్యింది. ఛానెల్‌ లో టెలికాస్ట్‌ అయినా కూడా యూట్యూబ్‌‌లో భారీ ఎత్తున ఈ సినిమా‌కు సంబంధించిన వీడియోకు వ్యూస్ దక్కించుకున్నాయి. యూట్యూబ్‌‌లో డీజే హిందీ వెర్షన్‌కు ఏకంగా వంద మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుంది. సాధారణంగా అల్లు అర్జున్‌ సినిమాలు మళయాళంలో సూపర్‌ హిట్‌ అవుతుంటాయి. మళయాళంలో బన్నీ కొన్ని సినిమాలు థియేటర్లలో రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు హిందీలో కూడా భారీ వ్యూస్ దక్కించుకోవడంతో ఫ్యాన్స్‌ ఆనందపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కూడా నార్త్ ఇండియాలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుందని అంతా భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>