PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-roja24f7b941-bdd8-40a3-8c59-5925776a1b8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-roja24f7b941-bdd8-40a3-8c59-5925776a1b8e-415x250-IndiaHerald.jpgచిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కే రోజా సెల్వమణి కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మార్చి నెల చివరి వారంలో చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రిలో రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న ఆర్.కె.రోజా ఏప్రిల్ 4వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచించడంతో ప్రస్తుతం ఆమె చెన్నై నగరంలోని తన నివాసంలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రోజా కి ఫోన్kcr roja;kcr;poorna;roja selvamani;roja;jagan;telangana;district;smart phone;sri venkateswara swamy;chief minister;mla;chennai;march;nagari;coronavirusఎమ్మెల్యే రోజాకి ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్..!ఎమ్మెల్యే రోజాకి ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్..!kcr roja;kcr;poorna;roja selvamani;roja;jagan;telangana;district;smart phone;sri venkateswara swamy;chief minister;mla;chennai;march;nagari;coronavirusSat, 24 Apr 2021 10:37:20 GMTజిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కే రోజా సెల్వమణి కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మార్చి నెల చివరి వారంలో చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రిలో రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న ఆర్.కె.రోజా ఏప్రిల్ 4వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచించడంతో ప్రస్తుతం ఆమె చెన్నై నగరంలోని తన నివాసంలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రోజా కి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంతే కాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రోజా కుటుంబ సభ్యుల బాగోగుల గురించి కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా సాక్షాత్తూ సీఎం కేసీఆరే తనకు ఫోన్ చేయడం తో ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సీఎం కేసీఆర్ తన కి ఫోన్ చేసి పరామర్శించారు అని ఆమె ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వైద్యుల సలహాలు పాటించాలని కేసీఆర్ తనకు చెప్పినట్టు రోజా తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు చేసిన మంచి సేవలే నాయకులకు గొప్ప గుర్తింపు తెస్తాయని కేసీఆర్ తనకు చెప్పారని రోజా తెలిపారు.

అయితే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అయితే కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కుదట పడాలని రోజా ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు రోజా చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం జగన్ కూడా రోజా కి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఆరోగ్యం మీదనే దృష్టి పెట్టాలని.. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని ఆయన రోజాకు చెప్పారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>