Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ppe4afabfe3-d25c-4fbb-be2f-0fded9d47c83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ppe4afabfe3-d25c-4fbb-be2f-0fded9d47c83-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ క్లిష్టపరిస్థితుల్లో ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బంధాలను బంధుత్వాలను పూర్తిగా మరిచిపోయేలా చేస్తుంది మహమ్మారి కరోనా వైరస్. వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఇక తమ సొంత కుటుంబీకుల దగ్గరికి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. వారి దగ్గరికి వస్తే ఎక్కడ తమ ప్రాణాలు పోతాయో అని ఆమడ దూరంలో ఉండి పోతున్నారు ఎంతో మంది. అయితే సొంత వాళ్లే ఇలా కరోనా వైరస్ రోగులను దూరం పెడుతూ ప్రాణభయంతో ఉంటే అటు వైద్య సిబ్బంది మాత్రం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి Ppe;coronavirusకని కరోనా : పీపీఈ కిట్లలో మగ్గిపోతున్నాం.. కాస్తా సెలవులు ఇవ్వండి సారూ..?కని కరోనా : పీపీఈ కిట్లలో మగ్గిపోతున్నాం.. కాస్తా సెలవులు ఇవ్వండి సారూ..?Ppe;coronavirusSat, 24 Apr 2021 08:30:00 GMTకరోనా వైరస్ క్లిష్టపరిస్థితుల్లో ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  బంధాలను బంధుత్వాలను పూర్తిగా మరిచిపోయేలా చేస్తుంది మహమ్మారి కరోనా వైరస్.  వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఇక తమ సొంత కుటుంబీకుల దగ్గరికి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. వారి దగ్గరికి వస్తే ఎక్కడ తమ ప్రాణాలు పోతాయో అని ఆమడ దూరంలో ఉండి పోతున్నారు ఎంతో మంది. అయితే సొంత వాళ్లే ఇలా కరోనా వైరస్ రోగులను దూరం పెడుతూ ప్రాణభయంతో ఉంటే అటు వైద్య సిబ్బంది మాత్రం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు.



 అయితే ఏ మాత్రం పొరపాటు జరిగినా తమ ప్రాణాలు పోతాయని ఇక తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిసినప్పటికీ ఈ వైద్య సిబ్బంది మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే వైద్య సిబ్బంది అలుపనేది లేకుండా పని చేస్తూనే ఉన్నారు. గత ఏడాది వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అటు వైద్య సిబ్బందికి ఎక్కడ విశ్రాంతి లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో ప్రస్తుతం వైద్య సిబ్బంది మొత్తం గంటల తరబడి పనిచేస్తూ పీపీఈ కిట్స్ లో మగ్గి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే విశ్రాంతి లేకుండా డ్యూటీ చేయడంపై ప్రస్తుతం పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి లేని కరోనావైరస్ డ్యూటీ తో తమ పరిస్థితి దారుణంగా తయారైందని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గంటల తరబడి డ్యూటీలో మునిగిపోతూ పీపిఈ కిట్ల లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము అంటూ చెబుతున్నారు. కనీసం గొంతు ఆరిపోతే మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం దొరకడం లేదు అని చెబుతున్నారు.  ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్  కేసుల సంఖ్య విపరీతంగా ఉందని అందుకే కాస్త ఒత్తిడితో సతమతమవుతున్నామని తమకు క్వారంటైన్ తో కూడిన సెలవులు ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇంత చేస్తోన్న జ‌గ‌న్‌ను వారు మెచ్చ‌ట్లేదా... రీజ‌న్ ఇదే ?

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>