PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/khammam-election0475293a-5386-4688-a3f9-8d02e3d327ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/khammam-election0475293a-5386-4688-a3f9-8d02e3d327ad-415x250-IndiaHerald.jpgఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 59డివిజ‌న్‌ల‌కు ఈ నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఒక డివిజ‌న్‌ను ఏక‌గ్రీవం చేసుకున్న టీఆర్ఎస్.. మిగిలిన 59డివిజ‌న్‌ల‌లోనూ తెరాస జెండాను ఎగుర‌వేస్తామ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ధీమాతో ఉన్నారు. కార్పొరేష‌న్‌లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను పువ్వాడ తీసుకున్నారు. అన్ని డివిజ‌న్‌ల‌లో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు రూట్ మ్యాప్‌లు సిద్ధం చేసుకున్నారు.Khammam election;kumaar;ali;hyderabad;telangana rashtra samithi trs;mp;district;chief minister;minister;mantraఖ‌మ్మంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న తుమ్మ‌ల‌, పువ్వాడ‌ఖ‌మ్మంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న తుమ్మ‌ల‌, పువ్వాడ‌Khammam election;kumaar;ali;hyderabad;telangana rashtra samithi trs;mp;district;chief minister;minister;mantraSat, 24 Apr 2021 16:54:00 GMTఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 59డివిజ‌న్‌ల‌కు ఈ నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఒక డివిజ‌న్‌ను ఏక‌గ్రీవం చేసుకున్న టీఆర్ఎస్.. మిగిలిన 59డివిజ‌న్‌ల‌లోనూ తెరాస జెండాను ఎగుర‌వేస్తామ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ధీమాతో ఉన్నారు. కార్పొరేష‌న్‌లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను పువ్వాడ తీసుకున్నారు. అన్ని డివిజ‌న్‌ల‌లో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు రూట్ మ్యాప్‌లు సిద్ధం చేసుకున్నారు. పువ్వాడ‌కుతోడు రాష్ట్ర స్థాయి ముఖ్య‌నేత‌లు, మంత్రులు ప్ర‌చారంలో పాల్గోనున్నారు. తాజాగా శ‌నివారం ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పువ్వాడ‌తో మంత్రి మ‌హ‌మూద్ అలీ, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ నామాలు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో తుమ్మల పాల్గొన‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తుమ్మ‌లకు, మంత్రి పువ్వాడ‌కు విబేధాలు ఉన్నాయ‌న్న చ‌ర్చ జిల్లాలో సాగుతుంది. దీనికి బ‌లాన్ని చేకూర్చుతూ పువ్వాడ సైతం ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల వ‌ర్గానికి బీఫాంలు ఇవ్వ‌లేద‌న్న ప్ర‌చారం సాగింది. ఈక్ర‌మంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో తుమ్మ‌ల పాల్గొనే అవ‌కాశం లేద‌ని అంద‌రూ భావించారు. అయితే శుక్ర‌వారం తుమ్మ‌ల నివాసానికి వెళ్లిన పువ్వాడ‌.. ప్ర‌చారానికి రావాల‌ని ఆహ్వానించారు. దీంతో తుమ్మ‌ల శ‌నివారం జ‌రిగిన ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా తుమ్మ‌ల మాట్లాడుతూ.. ఖ‌మ్మం జిల్లా అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనలో ఖమ్మం అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మం అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి‌కి ల్యాండ్ మార్క్‌గా నిలిపామని చెప్పారు. జిల్లాలో కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటం ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అయితే ఈ స‌మావేశంలో పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పాల్గొన‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే వేరే ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో ఉండ‌టం వ‌ల్ల పొంగులేటి పాల్గొన‌లేద‌ని, ప్ర‌చారంలో పాల్గొంటార‌ని తెరాస నేత‌లు పేర్కొంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>