PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeramc35730b9-daa7-4504-95a0-49e0bfe13136-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeramc35730b9-daa7-4504-95a0-49e0bfe13136-415x250-IndiaHerald.jpgఏపీ టీడీపీలో దూకుడు స్వభావం కలిగిన నాయకులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో మాట్లాడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టగలిగే నేతల్లో పరిటాల శ్రీరామ్ కూడా ఒకరు. రాజకీయాల్లోకి రావడమే ఓటమితో మొదలుపెట్టిన శ్రీరామ్, ప్రస్తుతం టీడీపీలో కీలక నాయకుడు ఉన్నారు. తన తల్లి సునీత కాస్త రాజకీయాలకు దూరంగా ఉండటంతో శ్రీరామ్ మరింత దూకుడు పెంచారు. అయితే ఒకేసారి రెండు బాధ్యతలు వచ్చినా శ్రీరామ్ ఎక్కడా తగ్గడం లేదు.paritala sreeram;soori;sriram;andhra pradesh;2019;mla;cheque;dharmavaram;tdp;paritala ravindra;party;raptaduశ్రీరామ్ తగ్గట్లేదుగా....ఒకటి ఫిక్స్ చేసుకున్నట్లేనా?శ్రీరామ్ తగ్గట్లేదుగా....ఒకటి ఫిక్స్ చేసుకున్నట్లేనా?paritala sreeram;soori;sriram;andhra pradesh;2019;mla;cheque;dharmavaram;tdp;paritala ravindra;party;raptaduSat, 24 Apr 2021 04:00:00 GMTఏపీ టీడీపీలో దూకుడు స్వభావం కలిగిన నాయకులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో మాట్లాడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టగలిగే నేతల్లో పరిటాల శ్రీరామ్ కూడా ఒకరు. రాజకీయాల్లోకి రావడమే ఓటమితో మొదలుపెట్టిన శ్రీరామ్, ప్రస్తుతం టీడీపీలో కీలక నాయకుడు ఉన్నారు. తన తల్లి సునీత కాస్త రాజకీయాలకు దూరంగా ఉండటంతో శ్రీరామ్ మరింత దూకుడు పెంచారు. అయితే ఒకేసారి రెండు బాధ్యతలు వచ్చినా శ్రీరామ్ ఎక్కడా తగ్గడం లేదు.


2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి శ్రీరామ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఓడిపోయినా సరే నియోజకవర్గంలో ఉంటూ పనిచేసుకుంటున్నారు. ఇదే సమయంలో రాప్తాడు పక్కనే ఉన్న ధర్మవరం బాధ్యతలు కూడా శ్రీరామ్‌కే అప్పగించారు. అక్కడ టీడీపీ నేత వరదాపురం సూరి పార్టీ మారడంతో చంద్రబాబు, ధర్మవరం బాధ్యతలు కూడా శ్రీరామ్‌కే అప్పజెప్పారు.


అయితే రెండు నియోజకవర్గాల్లోనూ శ్రీరామ్ కష్టపడి పనిచేస్తున్నారు. రెండుచోట్లా కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో బలంగా ఉన్న ప్రత్యర్ధులు, టీడీపీని గట్టిగానే టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బలంగా ఉన్నారు. ఇక్కడ ఆయనకు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. ఎప్పుడు ప్రజల్లో ఉండే కేతిరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దీంతో అక్కడ టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, శ్రీరామ్ వెనక్కి తగ్గకుండా పనిచేస్తూ ముందుకెళుతున్నారు. కేతిరెడ్డికి ధీటుగానే రాజకీయం చేస్తున్నారు.


ఇటు రాప్తాడులో కూడా శ్రీరామ్ తగ్గట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌కు చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారు. తనపై ఎన్ని కేసులు వచ్చి పడినా శ్రీరామ్ మాత్రం దూకుడు తగ్గించడం లేదు. తోపుదుర్తిని గట్టిగానే టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. వారు ఎలాంటి రాజకీయం చేసినా, అందుకు ధీటుగానే రాజకీయం చేస్తున్నారు. అయితే ధర్మవరంతో పోలిస్తే రాప్తాడులో శ్రీరామ్ స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తోంది. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>