PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus46acf875-9497-4a32-a126-49a6c8f2e205-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus46acf875-9497-4a32-a126-49a6c8f2e205-415x250-IndiaHerald.jpgమనిషికి మనిషే శత్రువుగా మారుతున్నాడు. ఇరుగు పొరుగులే పగ వారుగా మారిపోతున్నారు. అంతా కలసి ఉన్న వారే ఇపుడు బోర్డులు కట్టి బౌండరీలు పెట్టి మరీ నో ఎంట్రీ చూపిస్తున్నారు. మొత్తానికి ఇది పాపమా లేక శాపమా అని ఎవరైనా బాధపడినా ఆ తప్పు వారిది కాదేమో. caronavirus;odisha;allu sneha;shatru1కని కరోనా : అక్కడ మనోడే పగోడు ?కని కరోనా : అక్కడ మనోడే పగోడు ?caronavirus;odisha;allu sneha;shatru1Sat, 24 Apr 2021 15:28:00 GMT
ఉత్తరాంధ్రా జిల్లాలు కరోనాతో అల్లల్లాడుతున్నాయి. మూడు జిల్లాల్లో కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. అన్నింటికీ మించి శ్రీకాకుళం జిల్లాల్లో వేయి దాటి మరీ కేసులు ప్రతీ రోజూ నమోదు అవుతున్నాయి. ఈ పరిణామంతో పొరుగున ఉన్న ఒడిషా వాసులు హడలిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాను పెనవేసుకుని ఉన్న ఒడిషా  జిల్లాల ప్రజానీకం అయితే మీరు రావద్దు అనేస్తున్నారు. ఇక ఏపీవ్యాప్తంగా రోజులు 12 వేలకు తగ్గకుండా పెరుగుతున్న కేసులతో ఇతర రాష్ట్రాలు కూడా బెంబేలెత్తుతున్నారు. దాంతో ఒడిషా ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకుంటోంది. ఉత్తరాంధ్రా జిల్లాల వాసులు రాకుండా కఠినమైన నిర్ణయాలను తీసుకుంటోంది.

దాంతో తమకు దగ్గర ప్రాంతాలకు కూడా పొరుగున వారు వెళ్లలేకపోతున్నారు. అటూ ఇటూ వ్యాపారాలు, బంధుత్వాలు, ఇతర స్నేహ బంధాలు కూడా ఉన్నాయి. కానీ ఇపుడు కరోనా వచ్చి విడదీసింది అని వారంతా మధనపడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే తమ రాష్ట్ర పౌరులను కాపాడుకోవడానికి ఒడిషా సర్కార్ చేస్తోంది మంచి పనే అయినా నిన్నటిదాకా ఇరుగు పొరుగు గా ఉన్న వారి మధ్య మాత్రం కంచె పడిపోయింది. అడ్డుగోడలు నిలువునా లేచి వెక్కిరిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గేవరకూ ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు చూస్తే అంతకంతకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో కరోనా కల్లోలమే కనిపిస్తోంది. దీంతో ఆ జిల్లాలో కరోనా కట్టడికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా అదుపులోకి రావడంలేదు అంటున్నారు. ఎక్కడికక్కడ సెల్ఫ్ లాక్ డౌన్ విధించినా కూడా కరోనా మాత్రం విశ్వరూపమే చూపిస్తోంది.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>