PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-virusa04c7f1f-fe03-4335-9a46-62f41707e80c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-virusa04c7f1f-fe03-4335-9a46-62f41707e80c-415x250-IndiaHerald.jpgకరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. మెరుపు సమ్మె దిశగా తెలంగాణ 108 సిబ్బంది అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అతి తక్కువ జీతంతో సేవలు అందిస్తున్నా పిఆర్సిలో 108 పేరు ప్రస్తావించకపోవడంతో ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. 2015లో MOU ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం ఉద్యోగులకు పెంచి ఇవ్వాల్సిన 10 శాతం జీతం ఇవ్వకపోవడంతో పాటు ఎంఓయూ ముగిసిన తర్వాత ఉద్యోగుల అంకితభావం లో గాని 108 సర్వీస్ లో గాని తేడcorona virus;telangana;strike;mantraకని కరోనా : తెలంగాణకు కొత్త టెన్షన్ ?కని కరోనా : తెలంగాణకు కొత్త టెన్షన్ ?corona virus;telangana;strike;mantraSat, 24 Apr 2021 12:00:00 GMTకరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త టెన్షన్ వచ్చి పడింది.  మెరుపు సమ్మె దిశగా తెలంగాణ 108 సిబ్బంది అడుగులు వేస్తున్నారు.  దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అతి తక్కువ జీతంతో సేవలు అందిస్తున్నా పిఆర్సిలో 108 పేరు ప్రస్తావించకపోవడంతో ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. 2015లో MOU ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం ఉద్యోగులకు పెంచి ఇవ్వాల్సిన 10 శాతం జీతం ఇవ్వకపోవడంతో పాటు ఎంఓయూ ముగిసిన తర్వాత ఉద్యోగుల అంకితభావం లో గాని 108 సర్వీస్ లో గాని తేడా రానప్పుడు పెంచి ఇవ్వాల్సిన జీతం ఆపడానికి గల కారణాలు ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఉద్యోగుల పై పని ఒత్తిడి పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం నాలుగు రోజులకు బదులుగా ఆరు రోజులకు ఒక సెలవు విధానంతో ఉద్యోగులు శారీరకంగా మానసికంగా తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారని వాపోతున్నారు. కరోనా పేషెంట్లను తరలించడంలో అందరికంటే ముందుగా సేవలందిస్తున్న 108 సిబ్బందిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం బాలేదని అంటున్నారు. ముఖ్యంగా 108 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే గత ఐదు సంవత్సరాల నుండి పలుమార్లు మంత్రులను కలిసినా కూడా సమస్యలను ఏమాత్రం పట్టించుకోక పోవడం సరి కాదని అంటున్నారు. 

తక్షణమే ప్రభుత్వం స్పందించి 2015 నుంచి రావాల్సిన సంవత్సరానికి 10 శాతం చొప్పున ఆరు సంవత్సరాలకు ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 60 శాతం జీతాల పెంపుదల పాత బకాయిలతో సహా చెల్లించాలని లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని వారు చెబుతున్నారు. గత ఆరు సంవత్సరాల నుండి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎంతో ఓపికగా ఎంతో మంది ఉద్యోగులు కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత సర్వీసుకు మాత్రం బ్రేక్ ఇవ్వకుండా కుటుంబాలకు దూరంగా ఉండి మానవత్వంతో సేవలందిస్తున్నామని మంత్రుల ముందు సమస్యలు ఉంచామే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని నిందించలేదని వారు చెబుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>