PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-acb-tdp-ycpf97ab37f-bb12-4f0f-a5b6-fba36a419371-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-acb-tdp-ycpf97ab37f-bb12-4f0f-a5b6-fba36a419371-415x250-IndiaHerald.jpgయాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో అన‌గానే అవినీతి నిరోధ‌క‌శాఖ‌గా రాష్ట్రంలోని ప్ర‌జ‌ల్లో ఆ శాఖ‌కు ఒక గుర్తింపు ఉంది. పాల‌కులు, ప్ర‌భుత్వాధికారులు, ఇత‌ర‌త్రా ఎవ‌రైనా ప్ర‌భుత్వ సొమ్ముకు సంబంధించి అవినీతికి పాల్ప‌డితే వారిపై కేసులు న‌మోదుచేసి ద‌ర్యాప్తులో నిజాలు నిగ్గుతేలుస్తుంది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆ పార్టీ ఆదేశాల‌కు కొమ్ముకాస్తూ.. ముఖ్య‌నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తే శాఖ‌గా ఏసీబీ మారిపోయింది. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో కాస్తా యాంటీ చాద‌రి jagan;telugu desam party;devineni avinash;telugu;whatsapp;police;facebook;arrest;anti-corruption bureau;dhulipalla narendra kumar;kollu ravindra;party;narendraయాంటీ చౌద‌రి బ్యూరో??? (ఏసీబీ)యాంటీ చౌద‌రి బ్యూరో??? (ఏసీబీ)jagan;telugu desam party;devineni avinash;telugu;whatsapp;police;facebook;arrest;anti-corruption bureau;dhulipalla narendra kumar;kollu ravindra;party;narendraSat, 24 Apr 2021 11:46:00 GMTపార్టీ అధికారంలోకి వ‌స్తే ఆ పార్టీ ఆదేశాల‌కు కొమ్ముకాస్తూ.. ముఖ్య‌నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తే శాఖ‌గా ఏసీబీ మారిపోయింది. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో కాస్తా యాంటీ చాద‌రి బ్యూరోగా మారిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం న‌డుస్తోంది.

క‌మ్మ సామాజిక‌వ‌ర్గ‌మే లక్ష్యంగా..
ఆధారాలున్నా లేక‌పోయినా రాత్రికిరాత్రే వంద‌ల సంఖ్య‌లో పోలీసుల‌ను మొహ‌రింప‌చేయ‌డం.. అరెస్ట్ చేయాల‌నుకున్న‌వారిని, వారి కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం.. వారిలో మాన‌సిక ఆందోళ‌న పెంచ‌డం.. ఇవే ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అనుస‌రిసోత్న్న విధానాలు. ప్ర‌తిప‌క్ష పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి అధికార పార్టీ అనుస‌రిస్తోన్న ఎత్తుగ‌డ‌గా ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అయితే ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం ఒక సామాజిక‌వ‌ర్గాన్నే ల‌క్ష్యంగా పెట్టుకొని ఏసీబీని ముఖ్య‌నేత‌లు ఉసిగొలుపుతున్నార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. ఏసీబీద్వారా తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను భ‌య‌పెట్టాల‌నుకునే ల‌క్ష్యం ఒక‌వైపు, క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌నుకునే ల‌క్ష్యం మ‌రోవైపు ప్ర‌భుత్వ పాల‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఫేస్‌బుక్‌, వాట్సాప్ గ్రూపుల్లో స‌మాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు.

రేపు ఎవ‌రి వంతో?
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర..  రేపు మరో కీలక నేత ఎవ‌రైనా కావొచ్చు. తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిని అరెస్ట్ చేయ‌డం.. వారిపై కేసులు న‌మోదు చేయించ‌డం.. ఏ1, ఏ2, ఏ3లంటూ ఎఫ్ఐ ఆర్ దాఖ‌లుచేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఏసీబీ వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఇప్ప‌టికే ఆ శాఖ అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకుంది. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కాకుండా ఇత‌ర నేత‌ల‌పై ఏసీబీ దాడులు చేస్తున్న‌ప్ప‌టికీ ఇక్క‌డ ఆ సామాజిక‌వ‌ర్గ‌మే ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌నే భావ‌న అంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతోంది. తెలుగుదేశం పార్టీలో నోరున్నవారు.. గట్టిగా స్వ‌రం వినిపించేవారిపై ప్రభుత్వం విరుచుకుపడుతున్న తీరు, అరెస్ట్‌లు చేయిస్తున్న తీరుపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంకానీ, ప్ర‌భుత్వంలోని ముఖ్య‌నేత‌లు కానీ నోరు మెద‌ప‌డంలేదు. చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోతోంద‌న్న‌రీతిలో మౌనంగా ఉంటున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>