CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/-love-marriageb34da039-df88-4633-9ada-8cd7c414d272-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/-love-marriageb34da039-df88-4633-9ada-8cd7c414d272-415x250-IndiaHerald.jpgప్రేమకు కులం, మతం అంటూ తేడా లేదు. ఇద్దరి కులాలు, మతాలు వేరయినా సరే వారిని ఒక్కటి చేసింది. పెద్దలను ఎదురించి మరీ ప్రేమపెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వారి కాపురానికి గుర్తుగా తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ భార్య అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కనిపించింది.love marriage;prema;cinema theater;smart phone;police;kuppam;marriage;love;wife;lakshmi devi;girl;ala ela;punganurఆమె హిందూ.. అతడు ముస్లిం.. ప్రేమ.. పెళ్లి.. చివరకి..!ఆమె హిందూ.. అతడు ముస్లిం.. ప్రేమ.. పెళ్లి.. చివరకి..!love marriage;prema;cinema theater;smart phone;police;kuppam;marriage;love;wife;lakshmi devi;girl;ala ela;punganurSat, 24 Apr 2021 11:00:00 GMTప్రేమకు కులం, మతం అంటూ తేడా లేదు. ఇద్దరి కులాలు, మతాలు వేరయినా సరే వారిని ఒక్కటి చేసింది. పెద్దలను ఎదురించి మరీ ప్రేమపెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వారి కాపురానికి గుర్తుగా తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ భార్య అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కనిపించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు చెందిన 35 ఏళ్ల లతామాధురి, కుప్పం పట్టణానికి చెందిన షానవాజ్ ఇమ్రాన్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. ఇద్దరూ బెంగళూర్లో ఉద్యోగాలు చేసేవాళ్లు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెద్దలు అడ్డు చెప్పినా ఇద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత ఇద్దరూ హ్యాపీగా జీవిస్తూ ఉండటంతో పెద్దలు కూడా సర్దుకుపోయి వారితో బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వారిద్దరి కాపురానికి గుర్తుగా తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతేడాది లాక్ డౌన్ సమయంలో లతామాధురి, ఇమ్రాన్ బెంగళూరు నుంచి కుప్పానికి వచ్చారు. కుప్పంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్నారు.

అయితే గురువారం రాత్రి ఏమయిందో ఏమో కానీ, ‘ మీ అమ్మాయి లతామాధురి గుండెపోటుతో మరణించింది. ఆసుపత్రికి తీసుకెళ్లాను కానీ చనిపోయిందని చెప్పారు.‘ అంటూ లతామాధురి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కొద్ది గంటలకు ముందే కూతురు ఆ తల్లితో మాట్లాడింది. దీంతో తన కుమార్తె మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయనీ, తన అల్లుడే ఆమెను చంపి ఉంటాడని లతామాధురి తల్లి కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇక ‘నా కూతురు నాకు ఫోన్ చేసిన కొద్ది గంటలకే ఇమ్రాన్ ఫోన్ చేసి చనిపోయిందని చెబుతున్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆమె అలా ఎలా చనిపోతుంది. నా అల్లుడే చంపేశాడు’ అంటూ కేసు పెట్టింది. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని శుక్రవారం ఆసుపత్రికి తరలించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>