MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhiram-movie-updates3169c296-5485-4c64-ad68-d01c68335bb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhiram-movie-updates3169c296-5485-4c64-ad68-d01c68335bb0-415x250-IndiaHerald.jpgసిని ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల పరంపర ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. చిత్ర పరిశ్రమలో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీఈజీ గానే దొరికినా... తమ సొంత ప్రతిభతోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని నెగ్గుకొస్తున్నారు ఎంతో మంది స్టార్ కిడ్స్. మరి కొందరు వెనుదిరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. ABHIRAM MOVIE UPDATES;venkatesh;rana;suresh;abhiram;prema;teja;tollywood;cinema;producer;love;industry;director;minister;producer1;daggubati venkateswara rao;silver;sri reddy;reddy;nene raju nene mantriశ్రీ రెడ్డి ప్రేమికుడు అభిరామ్ చిత్రం ఈ డైరెక్టర్ తోనేనా...?శ్రీ రెడ్డి ప్రేమికుడు అభిరామ్ చిత్రం ఈ డైరెక్టర్ తోనేనా...?ABHIRAM MOVIE UPDATES;venkatesh;rana;suresh;abhiram;prema;teja;tollywood;cinema;producer;love;industry;director;minister;producer1;daggubati venkateswara rao;silver;sri reddy;reddy;nene raju nene mantriSat, 24 Apr 2021 16:17:43 GMTసిని ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల పరంపర ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. చిత్ర పరిశ్రమలో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీఈజీ గానే దొరికినా... తమ సొంత ప్రతిభతోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని నెగ్గుకొస్తున్నారు ఎంతో మంది స్టార్ కిడ్స్. మరి కొందరు వెనుదిరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇటీవలే మెగా ఫ్యామిలీ నుండి లాంచ్ అయిన వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఇప్పుడు మరో స్టార్ కిడ్ త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అతడు మరెవరో కాదు దగ్గుబాటి ఇంటి వారసుడు దగ్గుబాటి అభిరామ్.

దగ్గుబాటి ఫ్యామిలీలో  అగ్ర నిర్మాత రామానాయుడు పెద్దకొడుకు సురేష్ బాబు, చిన్న కొడుకు విక్టరీ వెంకటేష్ ఇద్దరు ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యారు. సురేష్ బాబు పెద్దకొడుకు రానా ఇప్పటికే టాలీవుడ్ లో అడుగు పెట్టి వైవిధ్యభరిత కథానాయకుడిగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు సురేష్ బాబు రెండవ కొడుకు అభిరామ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే గత మూడేళ్ళుగా ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి మాత్రం సురేష్ బాబు తన చిన్న కొడుకుని హీరోగా వెండి తెరపైకి తీసుకు రావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి'  ఫేమ్ డైరెక్టర్ తేజ ...అభిరామ్ ని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు సినీ వర్గాల నుంచి  సమాచారం అందుతోంది.

తేజ అందించిన కథ బాగా నచ్చడంతో... సురేష్ బాబు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది విన్న దగ్గుబాటి అభిమానులు అభిరామ్ కి వెల్ కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగా గతంలో దగ్గుబాటి అభిరామ్ కి వివాదాస్పద నటి శ్రీరెడ్డికి మధ్యన ప్రేమ కార్యకలాపాలు జరిగినట్లు అప్పట్లో శ్రీరెడ్డి పలు చాట్ లను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి సందర్భంలో మళ్ళీ అభిరామ్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>