MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-bunny86aaa62c-6096-474c-b71c-ad36728f742d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-bunny86aaa62c-6096-474c-b71c-ad36728f742d-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో చాల మంది నటులు, డైరెక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. కరోనా ప్రళయంతో అన్ని ఇండస్ట్రీలకు బ్రేక్ పడింది ఒక్క తెలుగు ఇండస్ట్రీకి తప్ప. టాలీవుడ్ లో కూడా సినిమాల షూటింగులు రద్దు అయ్యాయి.nani, bunny;nani;allu arjun;shyam;hyderabad;tollywood;cinema;huzur nagar;arjun 1;coronavirusఆ స్టార్ హీరోలు అందుకే బ్రేక్ ఇవ్వడం లేదా..!ఆ స్టార్ హీరోలు అందుకే బ్రేక్ ఇవ్వడం లేదా..!nani, bunny;nani;allu arjun;shyam;hyderabad;tollywood;cinema;huzur nagar;arjun 1;coronavirusSat, 24 Apr 2021 08:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో చాల మంది నటులు, డైరెక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. కరోనా ప్రళయంతో అన్ని ఇండస్ట్రీలకు బ్రేక్ పడింది ఒక్క తెలుగు ఇండస్ట్రీకి తప్ప. టాలీవుడ్ లో కూడా సినిమాల షూటింగులు రద్దు అయ్యాయి. ఒక్క నాని, బన్నీ మాత్రమే షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు బ్రేక్ ఇవ్వడం లేదు అంటూ సినీ జనం కూడా డౌట్ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో 80% హీరోలు ఖాళీ అయిపోయారు.

ఇక ఈ భయపడే లిస్ట్ లో తాము ఉండబోము అంటూ నాని, బన్నీ మాత్రం తమ సినిమాల షూట్ ను మాత్రం ఆపడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్ లో తమ షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి ఈ హీరోలు ఇద్దరు చేస్తోన్న రెండు సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యేవి కావు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అసలు ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కావు. మరి ఎందుకు నాని, బన్నీ ఇంత తొందరపడుతున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నా వీళ్ళు ఎందుకు భయపడడం లేదు అనేదే ఫిలింనగర్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అయితే అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ కంటిన్యూ చేయడానికి కారణం.. పుష్ప టీమ్ ఇప్పటికే కరోనా కారణంగా పలుమార్లు షూటింగ్ కి విరామం ఇవ్వడమే . దాంతో ఎప్పటినుండో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ చేస్తున్నారు. అలాగే చిత్రయూనిట్ గత కొంతకాలంగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమ సెట్స్ లోనే మకాం పెట్టింది. దాని కారణంగానే టీమ్ కి కరోనా భయం లేదు. ఒకవేళ కరోనా కేస్ లు నమోదు అయితే, అప్పుడు షూట్ కి బ్రేక్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు.

అంతేకాదు.. నాని హీరోగా చేస్తోన్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకపోవడానికి కారణం.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేశారు. ఆ సెట్ కేవలం మరో నెల రోజులు మాత్రమే ఉంటుంది, భారీగా ఖర్చు పెట్టి సెట్ వేయడంతో.. తప్పక షూట్ చేయాల్సి వస్తోంది. అందుకే నాని కూడా షూట్ లో పాల్గొంటున్నాడు. కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకు భయపడకుండా షూటింగ్ పూర్తి చేస్తున్న టాలీవుడ్ సినిమాలివే.!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>