MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-confujion-becomes-hot-topicdf86f30e-f4b0-4c8b-9c9e-1bdd30a44ab2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-confujion-becomes-hot-topicdf86f30e-f4b0-4c8b-9c9e-1bdd30a44ab2-415x250-IndiaHerald.jpg‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి ఎదుర్కుంటున్న సమస్యలు ‘బాహుబలి’ విషయంలో కూడ ఎదుర్కోనలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను 18 నెలలలో పూర్తి చేయాలి అన్న యాక్షన్ ప్లాన్ తో ఈమూవీ ప్రారంభించాడు. అయితే ఈ సినిమా నిర్మాణానికి గత సంవత్సరం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ విడుదల విషయంలో జక్కన్న తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. వరసపెట్టి కరోనా పరిస్థితులు ఇండస్ట్రీని అతలాకుతంలం చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ ఈ సంవత్సరం కాకుండా వచ్చrajamouli;;business;rajamouli;andhra pradesh;rrr movie;cinema;bahubaliరాజమౌళిలో మొదలైన అంతర్మధనం !రాజమౌళిలో మొదలైన అంతర్మధనం !rajamouli;;business;rajamouli;andhra pradesh;rrr movie;cinema;bahubaliSat, 24 Apr 2021 10:00:00 GMT
‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి ఎదుర్కుంటున్న సమస్యలు ‘బాహుబలి’ విషయంలో కూడ ఎదుర్కోనలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను 18 నెలలలో పూర్తి చేయాలి అన్న యాక్షన్ ప్లాన్ తో ఈమూవీ ప్రారంభించాడు.


అయితే ఈ సినిమా నిర్మాణానికి గత సంవత్సరం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ విడుదల విషయంలో జక్కన్న తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. వరసపెట్టి కరోనా పరిస్థితులు ఇండస్ట్రీని అతలాకుతంలం చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అన్న ఒక ప్రాధమిక నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈమూవీ విడుదలకు మంచి సీజన్ ను చూసుకోవడంతో పాటు ఈమూవీకి కనీసం 1000 కోట్ల బిజినెస్ చేయాలి అన్న రాజమౌళి టార్గెట్ ఇప్పుడు జక్కన్నకు కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి భారీ సినిమాలు విడుదల సమయంలో కనీసం రెండు వారాలపాటు టిక్కెట్ల రేటును భారీగా పెంచుకునే అవకాశం ఉంటేనే బయ్యలు భారీ మొత్తాలకు ఇలాంటి సినిమాలను కొనడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రెట్లు పెంపు విషయంలో ఆంక్షలు పెట్టిన నేపధ్యంలో ఇలాంటి ఆంక్షలు తొలిగిపోకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ కు భారీ స్థాయిలో బిజినెస్ అయ్యే అవకాశం లేదు.


ప్రస్తుతం ప్రభుత్వాల దృష్టి అంతా కరోనా పరిస్థితుల పైనే ఉంది. దీనితో టిక్కెట్ల రేట్లకు సంబంధించిన విషయాల పై ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం లేదు. అది తేలకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ ముందుకు సాగదు. ఇలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి తయారు చేసిన ప్రోడక్ట్ పై తనకు నచ్చిన రేటు నిర్ణయించుకునే హక్కు ఎందుకు ఉండదు అని జక్కన్న బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో సినిమాలు అన్నీ సినిమాటోగ్రఫీ చట్టాల క్రింద లోబడి ఉంటాయి. దీనితో రాజమౌళి రాయబారాలు చేసి ప్రభుత్వ నిర్ణయాలు మార్చుకోగలడు కాని తన ప్రోడక్ట్ కు తనకు నచ్చిన రేటును నిర్ణయించుకునే అవకాశం లేదు అన్న వాస్తవం ఇప్పటికే జక్కన్నకు తెలిసి ఉండాలి..  







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": వారెవ్వా.. ఆ ఒక్క డోసుతో కరోనా ఖతం..ఇక పండగే..!!

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>