PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/warangal-war54c81d86-f2a5-45f8-9de4-d059336cbb2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/warangal-war54c81d86-f2a5-45f8-9de4-d059336cbb2d-415x250-IndiaHerald.jpgఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులను అడ్డుకుంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ ఉంది.. ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆరే అని చెప్పారు. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు.warangal war;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;temple;central government;partyకబ్జాలు ఎలా చేయాలే సీఎం ట్రైనింగ్ ఇస్తున్నారట!కబ్జాలు ఎలా చేయాలే సీఎం ట్రైనింగ్ ఇస్తున్నారట!warangal war;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;temple;central government;partySat, 24 Apr 2021 17:07:54 GMTకొవిడ్ మహమ్మారి సమయంలోనూ తెలంగాణలో రాజకీయ మంటలు కొనసాగుతున్నాయి. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అధికార టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

ఓరుగల్లు ప్రజల్లో కాకతీయుల రక్తం ప్రవహిస్తోంది... పౌరుషాల గడ్డ ఓరుగల్లు.. ఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులను అడ్డుకుంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ వ్యాఖ్యానించారు.  వరంగల్‌లో ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ ఉంది.. ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆరే అని చెప్పారు. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే కబ్జాలు పెరిగాయని బండి సంజజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రౌడీ షీటర్లు, తలలు నరికిన వారికి, నగర బహిష్కరణ చేసిన వ్యక్తులకు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని బండి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేశామని భద్రకాళీ గుడి వద్ద ముక్కునేలకు రాయాలని ఆయన సవాల్ చేశారు. వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సమస్యలపై బీజేపీ పోరాటం చేసింది, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన కన్పిస్తోందని తెలిపారు. అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలిందన్నారు బండి సంజయ్.  సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు సంజయ్. రాష్ట్రంలో చేయాల్సినవి చేయకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో కనీస వసతులు కూడా లేవని మండిపడ్డారు. కరోనా రోగులకు బీజేపీ మద్దతుగా ఉంటుందని చెప్పారు బండి సంజయ్.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>