Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral44584edc-1780-427d-bd3d-ba7b8304a8fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral44584edc-1780-427d-bd3d-ba7b8304a8fe-415x250-IndiaHerald.jpg ప్రపంచంలో ఎన్నో వింత జంతువులున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మన కంట పడినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి వలకు ఓ విచిత్రమైన ఎండ్రకాయ ఒకటి దక్కింది. అన్ని ఎండ్రకాయల్లా అది ఎరుపు రంగులో కాకుండా..viral;patti;vవారెవ్వా.. అరుదైన నీలం రంగు ఎండ్రకాయ.. ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే..వారెవ్వా.. అరుదైన నీలం రంగు ఎండ్రకాయ.. ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే..viral;patti;vSat, 24 Apr 2021 22:53:00 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎన్నో వింత జంతువులున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మన కంట పడినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి వలకు ఓ విచిత్రమైన ఎండ్రకాయ ఒకటి దక్కింది. అన్ని ఎండ్రకాయల్లా అది ఎరుపు రంగులో కాకుండా నీలం రంగులో ఉంది. దీనిని చూడగానే సదరు జాలరి ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే దానిని ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో ఓ జాలరి చేపలు పట్టడానికి ఎప్పటిలానే పడవలో బయలుదేరాడు. అంతలో అతడి వలకు ఓ ఎండ్రకాయ దక్కింది. అది ఓ అరుదైన నీలి రంగు ఎండ్రకాయ. పడవలో చేపలు పడుతుండగా ఈ ఎండ్రకాయ అతడి వలలో చిక్కింది. దీనిని చూసిన అతడు మొదట ఆశ్చర్యపోయినా.. వెంటనే దాని గురించి చెప్పుకొచ్చాడు. ఆ ఎండ్రకాయ చాలా చిన్నదని, అందువల్ల దానిని బయటకు తీసుకురాకుండా నీటిలోనే వదిలేస్తున్నట్లు చెప్పాడు.

ఈ ఎండ్రకాయ గురించి అక్కడి నేషనల్ లాబ్‌స్టర్ హ్యాట్చరీ ప్రతినిధి స్పందించారు. సదరు అధికారి మాట్లాడుతూ.. ఇలాంటి ఎండ్రకాయలు ప్రతి 20 లక్షల్లో ఒకటి మాత్రమే ఉంటుందని, అయితే ఇవి నీలం రంగులో ఉండడం వల్ల ఇవి నీటిలో దాక్కోలేవని, వీటిని వేటాడే జంతువులకు సులభంగా దొరికిపోతాయని, అందువల్ల ఆహారంగా మారుతాయని వెల్లడించారు.

కాగా.. ఇవి ఇలా నీలం రంగులో ఉండడానికి కూడా కారణాలను సదరు అధికారి వెల్లడించారు. సాధారణంగా ప్రతి జీవి శరీరంలో రంగును ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయని, ఎండ్రకాయల శరీరంలో కూడా అలాంటి కణాలే వాటికి ఎరుపు రంగు వచ్చేలా చేస్తాయని చెప్పారు. కానీ ఇలాంటి వాటిల్లో రంగుకు సంబంధించిన కణాల్లో సంభవించే మార్పుల వల్ల ఇవి అరుదైన నీలం రంగులో మారతాయని వెల్లడించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>