PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asad-target-kcr94c80d1f-7b65-400f-ac99-89b8bbaf1caf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asad-target-kcr94c80d1f-7b65-400f-ac99-89b8bbaf1caf-415x250-IndiaHerald.jpgజడ్చర్లలో అసద్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ.. టీఆర్ఎస్ కు దూరం కానుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయినందువల్లే అసద్ అలా మాట్లాడారని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ కాకుంటే అసద్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారిందిasad target kcr;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;congress;mp;chief minister;parliment;assembly;mim party;partyటీఆర్ఎస్ కు అసద్ గుడ్ బై?టీఆర్ఎస్ కు అసద్ గుడ్ బై?asad target kcr;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;congress;mp;chief minister;parliment;assembly;mim party;partySat, 24 Apr 2021 13:59:48 GMTతెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు నమ్మకమైన మిత్రపక్షంగా ఉంది ఎంఐఎం పార్టీ. అధికారికంగా రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా.. లోపాయకారిగా కలిసి పని చేస్తున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం పోటీ చేసి గెలుస్తుండగా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎంఐఎం కారు పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ .. హైదరాబాద్ ఎంపీ అసద్ కు సన్నిహితంగా ఉంటారు. అసద్ ఏం చెప్పినా కేసీఆర్ చేస్తారనే ప్రచారం ఉంది. అయితే టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న అసద్ వాయిస్ ఇప్పుడు మారినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

తెలంగాణలో ప్రస్తుతం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అయితే జడ్చర్ల మున్సిపాలిటీలో మాత్రం సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు పతంగి పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అసద్.. టీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశామని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జడ్చర్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థులను కొందరు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు అసద్.

జడ్చర్లలో అసద్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ.. టీఆర్ఎస్ కు దూరం కానుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయినందువల్లే అసద్ అలా మాట్లాడారని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ కాకుంటే అసద్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. అయితే బీజేపీకి ఎంఐఎం సపోర్ట్ చేసే ఛాన్స్ ఉండదు. ఇక కొంత కాలంగా ఆయన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా అసద్ కుట్రలు చేస్తున్నారని, ఇందుకు బీజేపీ సపోర్ట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు పార్లమెంట్ వేదికగా కూడా బీజేపీతో పాటు కాంగ్రెస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అసద్. దీంతో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు దగ్గర కావడం అసాధ్యమంటున్నారు.

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు. షర్మిల పార్టీ తెరపైకి వచ్చినపుడే.. ఆమెకు అసదుద్దీన్ మద్దతు ఇవ్వవొచ్చనే ప్రచారం జరిగింది. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్నారు అసద్. ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీతో కలిసి ఎంఐఎం కలిసి నడవవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. తాజాగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఎంఐఎం చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>