PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caroanavirusd3c7dc1f-6ef0-4409-a4eb-38c501bdc180-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caroanavirusd3c7dc1f-6ef0-4409-a4eb-38c501bdc180-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది కనబడని శత్రువు. దీనికి మనిషే వాహకం. ఆ మనిషి కాస్తా చోటిస్తే చాలు నిలువునా దూరేసి చివరికి అతనినే చిద్రం చేసి తాను మాత్రం చావకుండా ఉండే అత్యంత విషపు పురుగు. caroanavirus;amrutha;tiru;air;oxygen;maha;shatru1;coronavirusకని కరోనా : ఏలికలు వేలుపులు కాదు... గుడ్డిగా పోతే యమ డేంజరే...?కని కరోనా : ఏలికలు వేలుపులు కాదు... గుడ్డిగా పోతే యమ డేంజరే...?caroanavirus;amrutha;tiru;air;oxygen;maha;shatru1;coronavirusSat, 24 Apr 2021 15:48:04 GMTకరోనా వైరస్ గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది కనబడని శత్రువు. దీనికి మనిషే వాహకం. ఆ మనిషి కాస్తా చోటిస్తే చాలు నిలువునా దూరేసి చివరికి అతనినే చిద్రం చేసి తాను మాత్రం చావకుండా ఉండే అత్యంత విషపు పురుగు.

మరి ఈ కరోనా వైరస్ ఇంతలా మీదన  మీద పడి ప్రాణం తీస్తున్నా కూడా జనాలకు ఇప్పటికీ భయం ఏంటో తెలిసిరావడంలేదు. ఓ వైపు అయిన వారూ  ఆప్తులు పోతున్నారు. నిన్నటిదాకా కనిపించిన వారు, కావాల్సిన వారు కళ్ల ముందు ఉన్న వారు కూడా మట్టిలోకి చేరిపోతూంటే కూడా సగటు జనాలకు కనువిప్పు కావడంలేదు.

తమకేం కాదని వీధులు పట్టి  మరీ గాలి తిరుగుళ్ళు  తిరిగేస్తున్నారు. తమ సరదాలు సంతోషాలు ఏవీ అసలు ఆపుకోవడంలేదు. దేనికి సెలవు ఇవ్వడంలేదు. కనీసం విరామం అయినా ప్రకటించడంలేదు. ఎందుకంటే అవే వారికి ముఖ్యం. పైగా తమకు ఏదైనా అయితే ఆదుకోవడానికి  పాలకులు ఉన్నారు కదా అని భావిస్తున్నారేమో. కానీ ఇక్కడ విషయమేంటి అంటే ప్రపంచాన్ని శాసించే వారు అయినా లోకాలను ఏలే వారు అయినా కరోనాకు ఒక్కటే. వారు ఎవరూ వేలుపులు కాదు, అమృతం తాగిన వారు అంతకంటే కారు.

కరోనా వస్తే రాజు అయినా పేద అయినా ఒక్కటే. మహా కవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఎవరో వస్తారని ఏదో చేస్తారని  గుడ్డిగా నమ్మి ముందుకు పోతే కరోనా కసాయి వైరస్ నోట్లో పడి బూడిద కావడం ఖాయం. ఇక్కడ పాలకుల తప్పు కూడా ఏమీ లేదు, వారు చెబుతున్నారు. మీ జాగ్రత్తలో మీరుండండి అంటూ ముందే అన్నీ చెబుతున్నారు. కానీ రోడ్ల మీదకు వచ్చి కరోనాతో దోస్తీ కట్టి ఆ మీదట తమకు ఆసుపత్రులలో  బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు అంటే ఎవరు బాధ్యులు అన్నదే ప్రశ్న. అదే ఇపుడు అతి పెద్ద చర్చ. బతికుంటే బలుసాకు తినవచ్చు అని ఒక  ముతక సామెత ఉంది.

దాన్ని పాటించి తీరాల్సిన సందర్భం ఇది. కరోనా మహమ్మారి కఠిన పద ఘట్టనల కింద నలిగిపోవడం కంటే నట్టింట తన వారితో సావాసం చేయడేమే మేలు.  ఒక ముద్ద తక్కువైతే తప్పు లేదు కానీ అది కాదనుకుని రోడ్డు మీదకు వస్తే ఏకంగా ఆయుష్షే తగ్గుతుంది. మరి ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలి. పాలకుల మీద పడి ఏడవడం కాదు, ఇంత పెద్ద జనాభాలో ఎవరికి ఎవరో. అందువల్ల ఇంటిని విడిచి రోడ్డున నడిచి ఇటు తన వారికి కన్నీటి శాపం కావద్దు. పాలకులకు భారం కూడా కావద్దు. కరోనాకు ఎదురెళ్ళి ఆనక ఏలికలను తిట్టినా ఉపయోగం లేదు. మొత్తానికి చెప్పేది ఏంటి అంటే ఎవరి రక్షణ వారిదే. ఎవరి బతుకు కూడా వారిదే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>