PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus92a0ac7c-aa50-465a-8967-47fcfb82b85a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus92a0ac7c-aa50-465a-8967-47fcfb82b85a-415x250-IndiaHerald.jpgగతంలో లాక్ డౌన్ సమయంలో పేదలకు ఉచిత రేషన్ పంపిణి చేశారు. తాజాగా మళ్లీ రేషన్ పంపిణికి నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత, కేంద్ర సర్కార్ నిర్ణయాలతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి రావొచ్చంటున్నారు. సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో మే నుంచి అంటే ఎన్నికల రిజల్ట్స్ తరువాత దేశంలో .. ఏ క్షణమైనా లాక్ డౌన్ విధిస్తారని అంటున్నారుcoronavirus;modi;kalyan;prime minister;heart;professor;central government;june;oxygen;mantraభారతీయులకు గుండె పగిలే న్యూస్..భారతీయులకు గుండె పగిలే న్యూస్..coronavirus;modi;kalyan;prime minister;heart;professor;central government;june;oxygen;mantraSat, 24 Apr 2021 10:30:05 GMTకరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. కొన్ని హాస్పిటల్స్ లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న లెక్కలకు.. అసలు జరుగుతున్న మరణాలను పొంతనే లేదంటున్నారు. దేశంలో పరిస్థితి చేయి దాటి పోయే పరిస్థితులు ఉండటంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోబోతందని తెలుస్తోంది.

మే, జూన్ నెలలకు సంబంధించి ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. పేద ప్రజలకు ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలు అందించబోతున్నారు.  పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద  దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది.  గతంలో లాక్ డౌన్ సమయంలో పేదలకు ఉచిత రేషన్ పంపిణి చేశారు. తాజాగా మళ్లీ రేషన్ పంపిణికి నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత, కేంద్ర సర్కార్ నిర్ణయాలతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి రావొచ్చంటున్నారు. సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో మే నుంచి అంటే ఎన్నికల రిజల్ట్స్ తరువాత దేశంలో .. ఏ క్షణమైనా లాక్ డౌన్ విధిస్తారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో జరుపుతున్న సంప్రదింపులు.. ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, ‘చివరి అస్త్రం’గా మాత్రమే లాక్‌డౌన్ ఉండాలని ఇటీవలే ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో చివరి అస్త్రాన్ని ప్రయోగించే చాన్సే ఎక్కువగా ఉంది. .

మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన అందరికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు.  అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి వ్యాక్సిన్ అందించడానికి చాలా సమయం పడుతుంది.  ఇప్పటికే పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. రాష్ట్రపతి మొదలు మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, మంత్రిత్వశాఖల ఉన్నత కార్యదర్శులు కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడం, అనేక వందల శ్మశానాల్లో 24 గంటలూ శవాలు కాలుతూనే ఉండడం, ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు షార్టేజీ, ఐసీయూ బెడ్లన్నీ ఫుల్ కావడం, కరోనా టెస్టింగ్ మొదలు ఆస్పత్రిలో అడ్మిషన్, శ్మశానంలో అంత్యక్రియల వరకు ప్రతిదానికీ వెయిటింగ్.. ఇలాంటి అనేక అంశాలు భారత్‌లో వైరస్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయం ఎపిడమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఈ నెల చివరికల్లా రోజూ ఐదు లక్షల కొత్త కేసులు, మూడు వేల కరోనా మృతుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలాంటివే ఇప్పుడు లాక్‌డౌన్ నిర్ణయానికి కారణమవుతున్నాయని అంటున్నారు . బహుశా అందుకే ముందుగానే రెండు నెలలకు రేషన్ ప్రకటించి లాక్ డౌన్ విధించే అవకాశం ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.  

ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కంటోన్మెంట్ ఆసుపత్రులను సాధారణ ప్రజల చికిత్స కోసం అనుమతించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అనేక అంశాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో ‘ఎమర్జెనీ తరహా’ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. మే 2వ తేదీ తర్వాత ఎప్పుడైనా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ సినిమా పై ఇంట్రెస్టింగ్ విషయాలు భయటపెట్టిన నాగ్ అశ్విన్..!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>