PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirusccf55384-ab09-4fb3-8b21-545b6f8265db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirusccf55384-ab09-4fb3-8b21-545b6f8265db-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ తాను అనుకున్న ప్రకారమే చేసుకుపోతారని పేరుంది. ఆయన విపక్షాల విమర్శలను పట్టించుకోరు. మీడియా మీటింగులు అసలు పెట్టరు. ఆయనకు కొన్ని కచ్చితమైన ఆలోచనలు ఉంటాయి. వాటి ప్రకారమే ఆయన ముందుకు సాగుతారు అని అంటారు. caronavirus;modi;tara;bharatiya janata party;kamma;jagan;andhra pradesh;media;central government;raccha;coronavirusకని కరోనా : మోడీ చేత వారెవ్వా అనిపించుకున్న జగన్...?కని కరోనా : మోడీ చేత వారెవ్వా అనిపించుకున్న జగన్...?caronavirus;modi;tara;bharatiya janata party;kamma;jagan;andhra pradesh;media;central government;raccha;coronavirusSat, 24 Apr 2021 12:06:57 GMTఏపీ సీఎం జగన్ తాను అనుకున్న ప్రకారమే చేసుకుపోతారని పేరుంది. ఆయన విపక్షాల విమర్శలను పట్టించుకోరు. మీడియా మీటింగులు అసలు పెట్టరు. ఆయనకు కొన్ని కచ్చితమైన ఆలోచనలు ఉంటాయి. వాటి ప్రకారమే ఆయన ముందుకు సాగుతారు అని అంటారు.

ఇదిలా ఉంటే మొదటి సారి గత ఏడాది కరోనా వైరస్ ఏపీని కమ్ముకున్నపుడు అత్యధిక కరోనా  టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీని నిలిపి  జగన్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఎక్కువ నంబర్ ఆఫ్ కేసులు ఏపీలో కనిపించినా కూడా అవన్నీ కరోనా  టెస్టులు చేయడం ద్వారా వచ్చినవేనని కేంద్రం కూడా భావించింది. దీని మీద వైద్య నిపుణులు కూడా అలాగే చేయడం చాలా  మంచి విధానమని కితాబు ఇచ్చారు.

ఇక ఇపుడు చూసుకుంటే కేంద్రం 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని కోరింది. దాని మీద దేశంలోని చాలా రాష్ట్రాలు రచ్చ చేస్తున్నాయి. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుని పోవడమే ఇదని కూడా అంతా అంటున్నారు. ఇక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మోడీ తీరుని కూడా తప్పుపడుతూ వచ్చాయి. దేశంలో ప్రతీ పౌరునికి మొత్తం వ్యాక్సినేషన్ వేయాల్సిన  బాధ్యత కేంద్రం మీద‌ ఉందని కూడా విపక్ష నేతలు గట్టిగా చెబుతున్నారు

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు జగన్ ఏ మాత్రం కేంద్రాన్ని విమర్శించలేదు. పల్లెత్తు మాట అనలేదు. ఏపీలో  మొత్తం 18 ఏళ్ళ నుంచి 45 లోపు వారికి వ్యాక్సినేషన్ చేసే బాధ్యతను తమ ప్రభుత్వమే స్వీకరిస్తుంది అని జగన్ స్పష్టం చేశారు. దీనికి అయ్యే 1600 కోట్ల రూపాయల ఖర్చుని కూడా తామే భరిస్తామని జగన్ సర్కార్ ముందుకు రావడం పట్ల కేంద్రం నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతోంది అంటున్నారు. ఇక ప్రతీ దానికీ ఏపీ సర్కార్ ని విమర్శించే ఏపీ బీజేపీ నేతలు కూడా జగన్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఇది మిగిలిన రాష్ట్రాలకు  ఆదర్శం అని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ తీసుకున్న ఈ చర్యతో మొత్తం దేశాన్ని మళ్ళీ తన వైపు తిప్పుకున్నారు అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>