PoliticsSAVIRIGANI MANIKUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/perugutonna-covid-maranala-sankhya-jarmany-tho-bharat-oppandam2c9fb703-5fc4-4130-9bf8-72d07181a7d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/perugutonna-covid-maranala-sankhya-jarmany-tho-bharat-oppandam2c9fb703-5fc4-4130-9bf8-72d07181a7d2-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. మొదటి దశ కరోనా కంటే ఈసారి ఆక్సిజన్ అవసరం ఎక్కువైంది. దీంతో ఆక్సిజన్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది కరోనా రోగులు చనిపోతున్నారు. నిజానికి మన దేశంలో ఆక్సిజన్ కొరత ఉండేది కాదు . అయినా ఇప్పుడు ఆక్సిజన్ కోసంcovid, oxigen;bharath;india;germany;sri bharath;central government;oxygen;paruguపెరుగుతోన్న కోవిడ్ మరణాల సంఖ్య.. జర్మనీతో భారత్ ఒప్పందం !పెరుగుతోన్న కోవిడ్ మరణాల సంఖ్య.. జర్మనీతో భారత్ ఒప్పందం !covid, oxigen;bharath;india;germany;sri bharath;central government;oxygen;paruguSat, 24 Apr 2021 08:00:00 GMTఆక్సిజన్ అవసరం ఎక్కువైంది. దీంతో ఆక్సిజన్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది కరోనా రోగులు చనిపోతున్నారు. నిజానికి మన దేశంలో ఆక్సిజన్ కొరత ఉండేది కాదు . అయినా ఇప్పుడు ఆక్సిజన్ కోసం పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఆక్సిజన్ కొరత వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వల పై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా రోజుకి 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది.


అయితే, ఇదే సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత కూడా పెద్ద సమస్యగా ఏర్పడింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నవారిసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలోని పలు ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత తీవ్రంగా పీడిస్తున్న నేపథ్యంలో కేంద్రరక్షణశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను విమానాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక్కో ఫ్లాంట్.. నిమిషానికి 40లీటర్ల ఆక్సిజన్ మరియు గంటలకు 2400లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల సామర్థం కలిగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.


కోవిడ్-19 పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్ లో మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఉంచనున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తెలిపారు. ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు భారత్ కి వస్తే ఆక్సిజన్ కొరత కొంచెం తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్లాంట్లు జర్మనీ నుంచి భారత్ కు రానున్నాయని భూషణ్ తెలిపారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SAVIRIGANI MANIKUMAR]]>