PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics21458407-654f-42f2-adff-a0c977eb508f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics21458407-654f-42f2-adff-a0c977eb508f-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సార్లు రాజకీయాలలో కొన్ని వాక్యాలు నినాదాలుగా చెప్పడానికి చాలా బాగుంటాయి. మరియు పవర్ ఫుల్ గా ఉంటాయి. కానీ ఈ నినాదాలను ఆచరణలో పెట్టడానికి వీలు పడకుండా ఉండిపోతాయి. ఒకవేళ అలాంటివి ఆచరణలోకి వచ్చినా అవి ప్రభుత్వాలు చేసినట్లుగా ప్రజలు అనుకోరు. సరిగ్గా ఇక్కడే చంద్ర బాబు దెబ్బ తిన్నారని చెప్పవచ్చు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతంలో 1996 లో చంద్రబాబు నాయుడు ఒక మాటను చెప్పారు.AP-POLITICS;cbn;poorna;tara;jagan;y. s. rajasekhara reddy;2019;dwcra;cm;chief minister;assembly;turmeric;tdp;nijam;shatru1జగన్ పాలనలో అయినా మహిళలు లక్షాధికారులవుతారా...?జగన్ పాలనలో అయినా మహిళలు లక్షాధికారులవుతారా...?AP-POLITICS;cbn;poorna;tara;jagan;y. s. rajasekhara reddy;2019;dwcra;cm;chief minister;assembly;turmeric;tdp;nijam;shatru1Sat, 24 Apr 2021 19:34:22 GMTకొన్ని కొన్ని సార్లు రాజకీయాలలో కొన్ని వాక్యాలు నినాదాలుగా చెప్పడానికి చాలా బాగుంటాయి. మరియు పవర్ ఫుల్ గా ఉంటాయి. కానీ ఈ నినాదాలను ఆచరణలో పెట్టడానికి వీలు పడకుండా ఉండిపోతాయి. ఒకవేళ అలాంటివి ఆచరణలోకి వచ్చినా అవి ప్రభుత్వాలు చేసినట్లుగా ప్రజలు అనుకోరు. సరిగ్గా ఇక్కడే చంద్ర బాబు దెబ్బ తిన్నారని చెప్పవచ్చు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతంలో 1996 లో చంద్రబాబు నాయుడు ఒక మాటను చెప్పారు. అదేమిటంటే "మహిళలను లక్షాధికారులను చేస్తామని", ఆ తరువాత 1999 లో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా గ్రూపులను నెలకొల్పి మళ్ళీ ఇదే మాటను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ లక్షాధికారులంటే అర్ధం ఒక లక్ష రూపాయలు ఉండడం కాదు. కొన్ని లక్షలకు అధికారిగా ఉండడం.

కానీ డ్వాక్రా గ్రూపులో సంవత్సరానికి ఇచ్చే లక్ష రూపాయలతో లక్షాధికారి ఎలా అవుతారో చంద్రబాబు ఆలోచించలేదు. మళ్ళీ 2014 లో సీఎంగా గెలిచినప్పుడు కూడా ఇదే మాటను చెప్పారు. కానీ ఈ సారి అంతకు మించిన వాగ్ధానాలే చేశాడు చంద్రబాబు. సంపూర్ణ రుణమాఫీ చేస్తానని..దారుణంగా మోసం చేశాడు. అది చేయక పోగా మహిళలకు టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. అంతే కాకుండా సున్నా వడ్డీ విధానాన్ని కూడా రద్దు చేయడంతో మహిళలకు ఆజన్మ శత్రువుగా మారిపోయాడు. పైగా తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో 10 వేల రూపాయలను పసుపుకుంకుమగా ఇచ్చి అప్పుడు కూడా వారిని ఉద్దేశించి "నేను చెప్పినట్టుగా మిమ్మల్ని లక్షాధికారులుగా చేస్తున్నాను" అని చెప్పాడు బాబు.

దీనితో ఈ కోపాలన్నిటినీ మనసులో పెట్టుకుని 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అర్ధరాత్రి వరకు క్యూ లో నిలబడి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కానీ ఆ సమయంలో చంద్రబాబు మరియు టీడీపీ నాయకులు ఆ ఓట్లన్నీ కూడా మనవే అని భ్రమపడ్డారు. కానీ తరువాత తెలిసింది ఇది మహిళల ఆగ్రహానికి పరాకాష్ట అని...అదే విధంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా మహిళల అభివృధికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్ చేయూత పేరుతో సంవత్సరానికి 74 వేలు వారి ఖాతాలో జమ చేస్తున్నారు. నిజంగా మహిళలు లక్షాధికారులు కావాలంటే వారికి సంబంధించి ఏదైనా అభివృద్ధి పధకాలను ప్రవేశ పెడితే, మరియు ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా సక్రమంగా జరిగితే అప్పుడు మహిళలు అంతా లక్షాధికారులవుతారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>