PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus5b631ac4-5275-4beb-b25a-b87cdb840be2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus5b631ac4-5275-4beb-b25a-b87cdb840be2-415x250-IndiaHerald.jpgకరోనా విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి అంచనాలు వారివి. నిజానికి కరోనా మహమ్మారి ఏ విధంగా దూసుకువస్తోందో, దాని జోరు ఏంటో ఎవరికీ ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితిగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది అంటున్నారు. caronavirusకని కరోనా : సెకండ్ వేవ్ అయితే ఓకే కానీ...?కని కరోనా : సెకండ్ వేవ్ అయితే ఓకే కానీ...?caronavirusSat, 24 Apr 2021 11:45:59 GMTకరోనా విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి అంచనాలు వారివి. నిజానికి కరోనా మహమ్మారి ఏ విధంగా దూసుకువస్తోందో, దాని జోరు ఏంటో ఎవరికీ ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితిగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది అంటున్నారు.

అయితే దీని మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇపుడు దేశంలో ఉన్నది సెకండ్ వేవ్ నా. లేక సెకండ్ వేరియెంట్ నా అన్న దాని మీదనే అధ్యయ‌నం చేయాల్సి ఉందని అంటున్నారు. నిజానికి సెకండ్ వేవ్ అంటున్నా కూడా ఇది కానే కాదన్న మాట కూడా ఉంది. గత ఏడాది వచ్చిన కరోనా లక్షణాలకూ ఈసారి వచ్చిన దానికి మధ్య చాలా తేడా ఉంది. అది కూడా ఆకాశం భూమికి మధ్య ఉన్నంత అంటున్నారు.

గత సారి పద్నాలుగు రోజుల సమయం ఇచ్చి మరీ కరోనా ఆ తరువాత తన ప్రతాపం చూపించేది. ఇపుడు మాత్రం సీన్ అలా లేదు లక్షణాలు ఏవీ కనిపించకుండానే పని పట్టేస్తోంది. అదే విధంగా కరోనా మహమ్మారి జోరు కూడా ఈసారి భీకరంగా ఉంది. దీని బట్టి చూస్తూంటే సెకండ్ వేరియెంట్ అన్నదే నిజమని అంటున్నారు. ఇక కొత్త రకాలు కూడా ఈ వైరస్ నుంచి వస్తాయి అని కూడా చెబుతున్నారు. అంటే కరోనా రూపాలు బహు విధాలు అని తేటతెల్లమవుతోంది.

అందువల్ల ఈసారి వచ్చిన కరోనాకు గత సారి తో అసలు పోలిక లేనేలేదు. కానీ గతంలో అనుసరించిన విధానాలనే ఈసారి కూడా నమ్ముకుంటే నంబర్ ఇంకా ఎక్కువగా పెరగడమే తప్ప ఉపయోగం లేదని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే కరోనా మహమ్మారి విషయంలో గత ఏడాది చూపిన శ్రద్ధ, తీసుకున్న జాగ్రత్తలు ఈసారి ఎక్కడా కనిపించడంలేదని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే సెకండ్ వేవ్ అన్నది మాత్రం పాక్షిక నిజం, కొత్త వేరియెంట్ అన్నది పచ్చి నిజమనే అంతా అంటున్నారు. దీంతో అటు పాలకులే కాదు, ఇటు సామాన్య ప్రజలు కూడా బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>