PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress58f27a90-d13c-42ac-a035-c318a76d88a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress58f27a90-d13c-42ac-a035-c318a76d88a3-415x250-IndiaHerald.jpgపార్టీ కార్య‌క్ర‌మాల్లో యువ‌కుడిలా దూకుడు ప్ర‌ద‌ర్శించే వీహెచ్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. చండీయాగం నిర్వ‌హించేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యాడు. హైద‌రాబాద్‌లోని అంబ‌రుపేట మ‌హంకాళి ఆల‌యంలో మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వ‌హించ‌నున్నారు. telangana congress;soniagandhi;kcr;ganga;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;ganges;rahul gandhi;mohandas karamchand gandhi;congress;tpcc;rahul sipligunj;v hanumantharao;central government;petta;partyత‌గ్గేదేలేదు.. కేసీఆర్ త‌ర‌హాలో వీహెచ్ కీల‌క నిర్ణ‌యం..త‌గ్గేదేలేదు.. కేసీఆర్ త‌ర‌హాలో వీహెచ్ కీల‌క నిర్ణ‌యం..telangana congress;soniagandhi;kcr;ganga;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;ganges;rahul gandhi;mohandas karamchand gandhi;congress;tpcc;rahul sipligunj;v hanumantharao;central government;petta;partySat, 24 Apr 2021 12:05:00 GMTకాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌ల్లో వీహెచ్ హ‌న్మంత‌రావు ఒక‌రు. చూడ‌టానికే వృద్ధ‌నేత అయినా ఆయ‌న చేసే ప‌నుల‌న్నీ, ఆయ‌న దూకుడు అచ్చం 30యేళ్ల యువ‌కుడి త‌ర‌హాలోనే ఉంటాయి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెరాస పార్టీల‌పై ఆయ‌న త‌న‌దైన రీతిలో విమ‌ర్శ‌లు చేస్తుంటాడు. కాంగ్రెస్ పార్టీలోనూ నిర్మొహ‌మాటంగా మాట్లాడే వ్య‌క్తుల్లో వీహెచ్ ఒక‌రు. కేంద్ర పార్టీ అదిష్టానం వ‌ద్ద ఒక‌టి, బ‌హిరంగంగా ఒక‌టి మాట్లాడే త‌ర‌హాలో కాకుండా.. ఏ విష‌యాన్నైన కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తాడు.

ఇటీవ‌ల టీపీసీసీ చీఫ్ ఎంపిక విష‌యంలోనూ వీహెచ్ ర‌చ్చ‌ర‌చ్చ‌చేసిన విష‌యం విధిత‌మే. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసేందుకు అధిష్టానం సిద్ధ‌మైంది. ఈక్ర‌మంలో వీహెచ్ తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకించారు. సీనియ‌ర్లు మేముండ‌గా.. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన వ్య‌క్తికి ఎలా ఇస్తారంటూ పార్టీ అధిష్టానాన్ని నిల‌దీశాడు. అవ‌స‌ర‌మైతే తాము పార్టీని వీడుతామంటూ కేంద్ర పార్టీ పెద్ద‌ల‌కు అల్టిమేటం జారీ చేశారు. వీహెచ్‌కు తోడు మ‌రికొంద‌రు సీనియ‌ర్లు తోడ‌వ్వ‌డంతో టీపీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా ప‌డింది. అయితే టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి త‌న‌కు అప్ప‌గించాలంటూ కేంద్ర పార్టీ పెద్ద‌ల‌వ‌ద్ద ఆయ‌న ప్ర‌స్తావించిన‌ట్లు ప్ర‌చారం సాగింది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీలంటే అమితంగా ఇష్ట‌ప‌డే వీహెచ్.. సోనియాకు వీర‌విధేయుడ‌న్న పేరుంది.

పార్టీ కార్య‌క్ర‌మాల్లో యువ‌కుడిలా దూకుడు ప్ర‌ద‌ర్శించే వీహెచ్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. చండీయాగం నిర్వ‌హించేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యాడు. హైద‌రాబాద్‌లోని అంబ‌రుపేట మ‌హంకాళి ఆల‌యంలో మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గాల‌ని, దేశ ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉండాల‌ని, రాహుల్ గాంధీ, మ‌న్మోహ‌న్‌సింగ్ లు క‌రోనా నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను యాగం చేస్తున్న‌ట్లు వీహెచ్ వెల్ల‌డించారు. రాష్ట్రంలో యాగాలంటే ప్ర‌తీఒక్క‌రికి సీఎం కేసీఆర్ గుర్తుకు వ‌స్తారు. తాజాగా వీహెచ్ చండీయాగం నిర్వ‌హిస్తాన‌ని పేర్కొన‌డంతో సీఎం కేసీఆర్‌కు పోటీగా తానేం త‌క్కువకాదు అన్న త‌ర‌హాలో ఈయాగానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>