PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kovid-pregnant-services-nurse-doctors-corona-warriors-gujarat9e86c2d9-9b48-4279-a490-fd1565a39792-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kovid-pregnant-services-nurse-doctors-corona-warriors-gujarat9e86c2d9-9b48-4279-a490-fd1565a39792-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజుకీ మూడు లక్షలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా సేవల్లో పాల్గొంటున్నారు. Kovid, pregnant, services, nurse, doctors, Corona Warriors, Gujarat;deva;gujarat - gandhinagar;police;kanna lakshminarayana;jaan;letter;service;ramzan;john;coronavirus;fidaaకోవిడ్ సేవల్లో గర్భిణి నర్సు.. రంజాన్ ఉపవాసంలో కూడా..?!కోవిడ్ సేవల్లో గర్భిణి నర్సు.. రంజాన్ ఉపవాసంలో కూడా..?!Kovid, pregnant, services, nurse, doctors, Corona Warriors, Gujarat;deva;gujarat - gandhinagar;police;kanna lakshminarayana;jaan;letter;service;ramzan;john;coronavirus;fidaaSat, 24 Apr 2021 21:00:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజుకీ మూడు లక్షలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా సేవల్లో పాల్గొంటున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా కొనసాగుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవల్లో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మహిళలు గర్భవతులుగా ఉంటూ సేవల్లో పాల్గొనడం గమనార్హం.


తాజాగా ఇలాంటి కేటగిరికి చెందిన ఓ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గర్భిణీగా ఉన్న ఓ నర్సు కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవలు చేస్తూ అందరి దగ్గర ప్రశంసలు పొందుతోంది. ముస్లిం అయిన ఆమె రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూనే కరోనా బాధితులకు సేవలు చేయడంతో ప్రజలందరూ ఫిదా అవుతున్నారు. నిండు గర్భిణీగా ఉన్న ఆమెను కరోనా వైరస్ నుంచి దేవుడు కాపాడాలని, పండంటి బిడ్డను జన్మనివ్వాలని ఆశీర్వదిస్తున్నారు.


ఆమె పేరు నాన్సీ అయేజా మిస్త్రీ. గుజరాత్‌లోని సూరత్‌లో నర్సుగా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సురత్‌లోని అల్థాన్‌ కమ్యూనిటీ హాల్‌లో కోవిడ్‌ రోగులకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆమెకు నెలుగో నెల. అయినా ఆమె ఏ మాత్రం భయపడకుండా రోగులకు చికిత్స అందిస్తోంది. ఇంకా ప్రత్యేకత ఏంటంటే.. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాసదీక్ష నియమాలు పాటిస్తూ.. ఎప్పుడు అలసి పోకుండా వైద్యం చేయడం. రోజూకీ 8 నుంచి 10 గంటల పాటు ఎంతో చురుగ్గా పాల్గొని వైద్యం చేస్తుంటారు. ఇంత రిస్క్ తీసుకుని కడుపులో బిడ్డను మోస్తూ విధులు నిర్వహించడం అవసరమా అని ఆమెను ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆమె నవ్వుతూ.. నా కడుపులో బిడ్డ పెరుగుతున్న విషయం వాస్తవమే.. కానీ, ప్రస్తుతం పరిస్థితి వల్ల ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో వారందరికీ నా అవసరం కొంతైనా ఉంటుంది. ఇంట్లో కూర్చోవడం కన్నా.. సేవ చేయడం వల్ల కొంత వరకు పుణ్యం దొరుకుతుందని ఆమె చెప్పుకొచ్చారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>