PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-jagan-ycp-10th-class-exams9f545efd-f4ee-4eae-9db8-05d9fcd3527e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-jagan-ycp-10th-class-exams9f545efd-f4ee-4eae-9db8-05d9fcd3527e-415x250-IndiaHerald.jpgఏపీలో ప‌ది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని.. క‌రోనా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డి ఆదేశించారు. ఏపీలో కరోనా పరిస్థితులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ఇతర రాష్ట్రాల మాదిరిగా నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. కానీ ప‌దోత‌ర‌గ‌తి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం మాత్రం తీసుకోలేదు. విద్యార్థులకు నష్టం జరగొద్దనే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. tdp;lokesh;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;telugu;chief minister;degree;ycp;lokesh kanagaraj;reddy;partyక‌ని క‌రోనా: జ‌గ‌న్‌, లోకేష్ కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు!!క‌ని క‌రోనా: జ‌గ‌న్‌, లోకేష్ కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు!!tdp;lokesh;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;telugu;chief minister;degree;ycp;lokesh kanagaraj;reddy;partySat, 24 Apr 2021 16:12:00 GMTఏపీలో ప‌ది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని.. క‌రోనా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డి ఆదేశించారు. ఏపీలో కరోనా పరిస్థితులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ఇతర రాష్ట్రాల మాదిరిగా నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. కానీ ప‌దోత‌ర‌గ‌తి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం మాత్రం తీసుకోలేదు. విద్యార్థులకు నష్టం జరగొద్దనే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు.

అన్ని రాష్ట్రాలు ర‌ద్దుచేశాయి
సీఎం జగన్ ప‌దోత‌ర‌గతి ప‌రీక్ష‌ల‌పై పట్టుదలకు పోతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి ఇంత ప‌ట్టుద‌ల‌గా ఉండ‌టానికి విపక్షాలు చేస్తున్న రాజకీయ‌మే కార‌ణ‌మ‌ని వైసీపీ నేతలే అంచనా వేస్తున్నారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు రద్దుచేయాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆన్లైన్ సమావేశాలు నిర్వహిస్తుండ‌టంతోపాటు  విద్యార్థులతో మాట్లాడిస్తున్నారు. సోషల్ మీడియాలో క్యాంపైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం  సాధ్యం కాదని నిపుణులంటున్నారు. అందుకే సీబీఎస్‌ఈ సహా అన్ని రాష్ట్రాలు ప‌ది పరీక్షలను రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి.

విప‌క్షాల రాజ‌కీయం
పరిస్థితులు మెరుగుపడ‌క‌పోగా క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు  కాకపోతే రేపైనా పరీక్షలను వాయిదా వేయక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల్లోనూ అదే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం పరీక్షలను రద్దుచేయడం ఖాయమని, అది తమ డిమాండ్ వల్లే అని చెప్పుకోవడానికి విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమానిస్తోంది. కరోనా గత ఏడాది కంటే ప్రమాదకరమైన పరిస్థితిలోకి దేశాన్ని నెట్టేసింది. రాష్ట్రాలన్నీ లాక్ డౌన్లు.. కర్ఫ్యూల బాట ప‌డుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోను ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌డంలేద‌ని, విప‌క్షాలు చేస్తున్న ప్ర‌చారంతో, నిర్వ‌హిస్తున్న స‌మావేశాల‌తో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో ప‌రీక్ష‌లు ర‌ద్ద‌వుతాయ‌నే భావ‌న నెల‌కొంద‌ని, పార్టీల‌ప‌రంగా, రాజ‌కీయాల ప‌రంగా ఎన్ని విభేదాలున్న‌ప్ప‌టికీ విద్యార్థుల క్షేమం దృష్ట్యా ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డ‌మే మంచిద‌ని విద్యానిపుణులు సూచిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>