PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-ministers-karimnagar-districtc4a1f1ed-ff45-4320-b1bd-72bec2d74c0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-ministers-karimnagar-districtc4a1f1ed-ff45-4320-b1bd-72bec2d74c0e-415x250-IndiaHerald.jpgక‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి కేబినెట్‌లో న‌లుగురు మంత్రులు ఉన్నారు. అయితే వీరు ఒకే వేదిక‌ల‌ను పంచుకోవ‌టం, క‌లిసి క‌నిపించ‌టం చాలా అరుదు. తాజాగా ఉమ్మ‌డి జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక స‌మీక్షా స‌మావేశంలో ముగ్గురు మంత్రులు ఒకేవేదిక‌ను పంచుకున్నారు. మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌లు ఏడాది క్రితం ముగ్గురు రెండోసారి కేబినెట్‌లో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.trs ministers karimnagar district;nithya new;telangana rashtra samithi trs;district;minister;dookudu;mantraఆ ముగ్గురు మంత్రుల‌ను క‌లిపిన క‌రోనా!ఆ ముగ్గురు మంత్రుల‌ను క‌లిపిన క‌రోనా!trs ministers karimnagar district;nithya new;telangana rashtra samithi trs;district;minister;dookudu;mantraSat, 24 Apr 2021 09:58:01 GMTక‌రోనా వైర‌స్ ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. వైర‌స్ వ్యాప్తిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతుంది. ఇప్ప‌టికే మాస్క్ ను త‌ప్ప‌నిస‌రి చేసిన ప్ర‌భుత్వం.. తాజాగా నైట్ క‌ర్ఫ్యూ విధించింది. క‌రోనా ప్ర‌తీఒక్క‌రిని భౌతిక‌దూరంతో దూరంచేస్తుంటే.. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మాత్రం ముగ్గురు మంత్రుల‌ను ఒకేద‌గ్గ‌ర‌కు చేర్చింది. చానాళ్లుగా వీరు ఒకేవేదిక‌పైకి రావ‌టం జ‌ర‌గ‌లేదు. జిల్లాలో క‌రోనా ఉధృతిపై జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఈ ముగ్గురు మంత్రులు ఒకేవేదిక‌పై ఆశీనుల‌య్యారు. ముఖ్యంగా ఈట‌ల‌, గంగుల క‌మ‌లాక‌ర్ల మ‌ధ్య విబేధాలు ఉన్న‌ట్లు జిల్లాలో చ‌ర్చ‌సాగుతుంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు ఒకేవేదిక‌పై ప‌క్క‌ప‌క్క‌నే క‌నిపించ‌డం తెరాస శ్రేణుల్లో సంతోషాన్ని నింపుతుంద‌ట‌.  

క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి కేబినెట్‌లో న‌లుగురు మంత్రులు ఉన్నారు. అయితే వీరు ఒకే వేదిక‌ల‌ను పంచుకోవ‌టం, క‌లిసి క‌నిపించ‌టం చాలా అరుదు. తాజాగా ఉమ్మ‌డి జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక స‌మీక్షా స‌మావేశంలో ముగ్గురు మంత్రులు ఒకేవేదిక‌ను పంచుకున్నారు. మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌లు ఏడాది క్రితం ముగ్గురు రెండోసారి కేబినెట్‌లో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరంతా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన‌ప్ప‌టికీ ఒక‌రికి ఒక‌రు క‌లుసుకున్న దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు బిజీబిజీగా గ‌డుపుతుంటారు. ఈట‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గంతో పాటు పెద్ద‌ప‌ల్లి జిల్లాలోనే ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తుంటారు. ధ‌ర్మ‌పురి నుండి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఈశ్వ‌ర్ జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాలోనే త‌న ప‌ర్య‌ట‌న‌లు అధికంగా ఉంటాయి. ఇక క‌రీంన‌గ‌ర్ జిల్లాలో నిత్యం గంగుల ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయి.

ఈట‌ల రాజేంద‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌ల మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌న్న చ‌ర్చ జిల్లాలో సాగుతుంది. గంగుల మంత్రి అయిన త‌రువాత కొంత దూకుడుగా ముందుకెళ్ల‌డంతో పాటు త‌న వ‌ర్గీయుల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం లేద‌ని ఈట‌ల అధిష్టానం వ‌ద్ద‌సైతం ఫిర్యాదులు చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. దీంతో వీరిద్ద‌రూ పొంత‌న‌లేకుండా ఉంటారు. వీరి వ‌ర్గీయులుసైతం సొంత‌పార్టీలో శ‌త్రువులుగా భావించుకుంటూ ఉంటార‌న్న వాద‌న ఉంది. దీంతో ఈ మంత్రులిద్ద‌రూ క‌లిసి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం చాలా అరుదు. తాజాగా క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన ఉమ్మ‌డి జిల్లా క‌రోనా నియంత్ర‌ణ స‌మీక్షా స‌మావేశంలో వీరు పాల్గొన‌డం, ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొని మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. ఒకేవేదిక‌పై ప‌క్క‌ప‌క్క‌నే ముగ్గురు మంత్రులు కూర్చొని స‌మావేశం నిర్వ‌హించ‌డంతో పాటు ఒక‌రితోఒక‌రు ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించ‌డం తెరాస శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుంద‌ట‌.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": వారెవ్వా.. ఆ ఒక్క డోసుతో కరోనా ఖతం..ఇక పండగే..!!

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>