BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpg ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇచ్చేకార్యక్రమం చేపట్టిన కేంద్రం.. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందcoronavirus;amala akkineni;central government;lieకని"కరోనా": కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!!కని"కరోనా": కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!!coronavirus;amala akkineni;central government;lieSat, 24 Apr 2021 18:14:44 GMTకరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది.దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం .. వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమన్న నిపుణులు అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్పీడప్ చేసింది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇచ్చేకార్యక్రమం చేపట్టిన కేంద్రం.. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

* ప్రైవేటు ఆసుపత్రులు, ఇండస్ట్రీలకు చెందిన ఆసుపత్రులు తదితర వాటి సహకారంతో అదనపు ప్రైవేటు కొవిడ్ వ్యాక్సిన్‌ కేంద్రాలను రిజిస్టర్‌ చేయాలి.
* ఏ ఏ ఆసుపత్రులు ఎన్ని వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయి.. టీకా నిల్వలు, వ్యాక్సిన్‌ ధరలను కొవిన్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
* కొవిన్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌లను అందుబాటులో ఉంచుతూ అర్హులై వారందరికీ టీకాలు వేయాలి.
* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ల కొనుగోలు నిర్ణయానికి ప్రాధాన్యమివ్వాలి.
* 18-45 ఏళ్ల వయసు గ్రూప్‌ వారికి కేవలం "ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రమే" అన్న విషయాన్ని ప్రచారం చేయాలి.
* వ్యాక్సినేషన్‌, కొవిన్‌ యాప్‌ వినియోగంపై సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలి.
* టీకా కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా చూసే అధికారులకు పూర్తి సహకారం అందించాలి.

ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ కోరారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>