PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd83222fa-ff3e-47be-864b-33d9af726075-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd83222fa-ff3e-47be-864b-33d9af726075-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది..గతేడాది నమోదైన కేసుల కంటే ప్రస్తుతం రోజు వారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఎక్కువ కావడంతో అంతాటా భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టాయి. లాక్ డౌన్ పెట్టే స్థితి రానివ్వకుండా ప్రస్తుతానికి ఎక్కడికక్కడ ఆంక్షలను విధిస్తున్నారు. తెలంగాణలో కూడా రాత్రి 9 గంటల నుంచి 5 వరకు కర్ఫ్యూను విధిస్తున్నారు.. అయినప్పటికి కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. Coronavirus;sathwara;maharashtra - mumbai;district;village;maharashtra;khanapurకని కరోనా: ఆ గ్రామంలో టెన్షన్.. సగం మందికి కరోనా..కని కరోనా: ఆ గ్రామంలో టెన్షన్.. సగం మందికి కరోనా..Coronavirus;sathwara;maharashtra - mumbai;district;village;maharashtra;khanapurFri, 23 Apr 2021 07:00:00 GMT

ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, శానిటైజర్లను విరివిగా వాడకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. అసలు విషయానికొస్తే.. కర్ణాటకలో ఓ గ్రామంలో జనాలు టెన్షన్ లో ఉన్నారు. సగానికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.బెలగావి జిల్లా ఖానాపూర్ తాలూకా ఆబానలి గ్రామంలో సగానికి సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ గ్రామంలో మొత్తం 300 మంది వరకు ప్రజలు ఉన్నారు. వారిలో కరోనా లక్షణాలు 150 మందికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు నిర్వహించారు. వారిలో 144 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. 


దీంతో ఆ గ్రామానికి రాకపోకలను నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారికి కూడా కరోనా చికిత్సలు నిర్వహిస్తామనీ, పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచి ప్రత్యేక వైద్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ,పాజిటివ్ వచ్చిన వారంతా రోజు వారీ కూలి పనులకు వెళ్లేవాళ్లే కావడం గమనార్హం. వారిలో అత్యధిక శాతం మంది ఇటీవలే మహారాష్ట్ర నుంచి తిరిగి తమ సొంతూరికి వచ్చారు. అలా వచ్చిన వారి నుంచే గ్రామంలో కరోనా ప్రబలి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఊరిలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నారు..ప్రజలు కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే తగు జాగ్రత్తలు పాటించా లని సూచిస్తున్నారు. 







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>