PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/perseverance-rover8c9b8264-0570-4540-b9f9-13005db3265a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/perseverance-rover8c9b8264-0570-4540-b9f9-13005db3265a-415x250-IndiaHerald.jpgనాసా పంపించిన ఆరు చక్రాల రోవర్ "పెర్సెవరెన్స్‌" అంగారక గ్రహం పై తొలిసారిగా ఆక్సిజన్ తయారుచేసి అద్భుతం సృష్టించింది. ఈ రోవర్‌లో ముందుభాగం లో కుడి వైపున ఉన్న ఒక పరికరాన్ని మెకానికల్‌ ట్రీగా పిలుస్తారు. కారు బ్యాటరీ సైజులో ఉండే ఈ మెకానికల్‌ ట్రీ మార్స్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ వాయువును సేకరించి ఆక్సిజన్ ని తయారుచేసింది. ఏప్రిల్ 20వ తేదీన ఈ మెకానికల్‌ ట్రీ విద్యుత్తు, రసాయనాల సహాయంతో కార్బన్ డయాక్సైడ్ ని విడగొట్టి 5 గ్రాముల ప్రాణవాయువును ఉత్పత్తి చేసింది. 5 గ్రాముల ఆక్సిజన్ ఒక ఆస్ట్రోనాట్ కి 1perseverance rover;vidya;nasa;february;oxygen;carbon dioxideఅద్భుతం: అంగారకుడిపై ఆక్సిజన్‌ తయారుచేసిన ‘పెర్సెవరెన్స్‌’..!అద్భుతం: అంగారకుడిపై ఆక్సిజన్‌ తయారుచేసిన ‘పెర్సెవరెన్స్‌’..!perseverance rover;vidya;nasa;february;oxygen;carbon dioxideFri, 23 Apr 2021 15:00:00 GMTనాసా పంపించిన ఆరు చక్రాల రోవర్ "పెర్సెవరెన్స్‌" అంగారక గ్రహం పై తొలిసారిగా ఆక్సిజన్ తయారుచేసి అద్భుతం సృష్టించింది. ఈ రోవర్‌లో ముందుభాగం లో కుడి వైపున ఉన్న ఒక పరికరాన్ని మెకానికల్‌ ట్రీగా పిలుస్తారు. కారు బ్యాటరీ సైజులో ఉండే ఈ మెకానికల్‌ ట్రీ మార్స్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ వాయువును సేకరించి ఆక్సిజన్ ని తయారుచేసింది. ఏప్రిల్ 20వ తేదీన ఈ మెకానికల్‌ ట్రీ విద్యుత్తు, రసాయనాల సహాయంతో కార్బన్ డయాక్సైడ్ ని విడగొట్టి 5 గ్రాముల ప్రాణవాయువును ఉత్పత్తి చేసింది. 5 గ్రాముల ఆక్సిజన్ ఒక ఆస్ట్రోనాట్ కి 10 నిమిషాల పాటు శ్వాస తీసుకోవడానికి సరిపోతుంది.

రోవర్‌లో ఉండే మోక్సీ (మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్) పరికరం అంగారక వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ సేకరించి గంటకు 10 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలదని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మార్స్ గ్రహం పైనే కార్బన్ డయాక్సైడ్ సేకరించి కార్బన్ మోనాక్సైడ్ బయటకి వదులుతూ ఆక్సిజన్ తయారు చేయగల మోక్సీ పరికరం కారణంగా ఇక భవిష్యత్తులో వ్యోమగాములు భూమి నుంచి అంగారకుడిపైకి వెళ్లేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు మోసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

మరో ప్రపంచం లో ఆక్సిజన్ తయారు చేయగల మోక్సీ.. మానవులకి ఊపిరి పీల్చగల అవకాశాన్ని కల్పించిన మొట్టమొదటి సాంకేతిక పరికరమని నాసా శాస్త్రవేత్తలు సగర్వంగా చెబుతున్నారు. ఫిబ్రవరి 18న మార్స్ గ్రహం పై పెర్సెవరెన్స్‌ రోవర్ ల్యాండ్ కాగా.. అందులోని 1.8 కిలోల బుల్లి హెలికాఫ్టర్‌ సోమవారం నాడు అక్కడి ఉపరితలంలో 3 మీటర్ల ఎత్తులో కొద్ది సమయం పాటు చక్కర్లు కొట్టి అద్భుతం సృష్టించింది. గురువారం రోజు మరో రెండు మీటర్ల ఎత్తు అనగా 5 మీటర్ల ఎత్తులో ఎగిరిన ఈ హెలికాప్టర్ మరో రికార్డు నెలకొల్పింది. అయితే మార్స్‌పై తొలిసారిగా శబ్దాలను నమోదు చేసిన రోవర్‌ గా పెర్సెవరెన్స్‌ రికార్డు సృష్టించింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినీఇండస్ట్రికి కోలుకోలేని షాక్.. ప్రముఖ నటుడు కన్నుమూత..!!

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!

ఇప్పటి మన స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటో తెలుసా..!!

సల్మాన్ ఖాన్ రాధే అల్లు అర్జున్ డిజె రీమేకేనా??

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>