MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirusda509c59-319a-4b0b-b066-78b722b0b060-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirusda509c59-319a-4b0b-b066-78b722b0b060-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకీ పరిస్థితి మరింత చేజారి పోతున్నట్లు అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. CORONAVIRUS;nikhil;ram gopal varma;vedhika;media;twitter;hero;yuva;oxygen;fatherమందుల్లేక బాధపడుతున్న కరోనా రోగికి హీరో నిఖిల్ సాయం...?మందుల్లేక బాధపడుతున్న కరోనా రోగికి హీరో నిఖిల్ సాయం...?CORONAVIRUS;nikhil;ram gopal varma;vedhika;media;twitter;hero;yuva;oxygen;fatherFri, 23 Apr 2021 11:52:03 GMT" style="height: 776px;">
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకీ పరిస్థితి మరింత చేజారి పోతున్నట్లు అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఈ మహమ్మారి వదిలేలా లేదనిపిస్తోంది. అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న పెద్ద పెద్ద వారిని సైతం ఇది వదిలిపెట్టడం లేదంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కరోనా వ్యాక్సినేషన్ ఓవైపు జరుగుతున్నప్పటికీ, అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇక మరో వైపు చూస్తే.. ప్రమాదం అంచుల్లో ఉన్న కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత ఉండనే ఉంది.

మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్‌ లు దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం బారులు తీరి గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం  సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిమాన హీరో నిఖిల్ ని రెమిడిసివిర్‌ ఇప్పించాలంటూ అర్ధించాడు. సురేంద్ర అనే వ్యక్తి... కరోనా సోకిన తన తండ్రి పరిస్థితి వివరించి ఆయన కోసం రెమిడిసివిర్‌ ఇప్పించండి అంటూ ట్విట్టర్ ద్వారా హీరో నిఖిల్ కు విజ్ఞప్తి చేశాడు.

ఇందుకు స్పందించిన యువ హీరో నిఖిల్...సిరివూరి రాజేశ్‌ వర్మ అనే వ్యక్తి, రెమిడిసివిర్‌ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ నాన్న గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు. ఈ విధంగా తన దయా హృదయాన్ని చాటుకున్నాడు హీరో నిఖిల్.  ప్రస్తుతం ఈ వార్త  సోషల్ మీడియాలో కరోనా కంటే స్పీడ్ గా వైరల్ గా మారింది. ఈ న్యూస్ విన్న ప్రజలు నిఖిల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలా సాయం చేయగల స్థాయిలో ఉన్నవారు... సాయం అర్ధించే వారికి  సహాయపడగలిగితే కొంతలో కొంత కరోనా నుండి ఊరట కలుగుతుందన్న భావనను వ్యక్తపరుస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఆ గ్రామాన్ని సీజ్ చేయ‌నున్న అధికారులు?

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>