MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-bf048b35-39e2-4286-86d3-82212c70f55e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-bf048b35-39e2-4286-86d3-82212c70f55e-415x250-IndiaHerald.jpgమొత్తానికి అద్దాల బొమ్మ లాంటి సినిమా బొమ్మ మీద కరోనా కరకు పదఘట్టనలు పడి చిద్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు సినీ సీమను కోలుకోలేని దెబ్బ తీయడంతో మాత్రం కరోనా విజయం సాధించింది అంటున్నారు. tollywood;chiranjeevi;venkatesh;balakrishna;cinema;cinema theater;love;director;hero;june;kusuma jagadish;tuck jagdish;mass;tuck jagadish;love storyకరోనా తగ్గినా ఈగలు తోలాల్సిందేనా...?కరోనా తగ్గినా ఈగలు తోలాల్సిందేనా...?tollywood;chiranjeevi;venkatesh;balakrishna;cinema;cinema theater;love;director;hero;june;kusuma jagadish;tuck jagdish;mass;tuck jagadish;love storyFri, 23 Apr 2021 17:16:02 GMTమొత్తానికి అద్దాల బొమ్మ లాంటి సినిమా బొమ్మ మీద కరోనా కరకు పదఘట్టనలు పడి చిద్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు సినీ సీమను కోలుకోలేని దెబ్బ తీయడంతో మాత్రం కరోనా విజయం సాధించింది అంటున్నారు.

ఇక కరోనా దెబ్బకు మరో మారు సినిమా హాళ్ళు మూసేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సినిమా హాళ్ళు తెరచి ముచ్చటగా శతదినోత్సవం అయినా కాకుండానే మళ్లీ క్లోజ్ అవుతున్నాయి. ఇప్పటికైతే వకీల్ సాబ్ తప్ప మరో కొత్త  బొమ్మ లేదు. పైగా ఫిఫ్టీ పర్సంట్ సీటింగ్, దాంతో కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో ఎందుకు థియేటర్లు తెరచి లాభమని  అనుకుంటూ మూసేస్తున్నారు.

అయితే ఈ మూసివేత ఎంతకాలం అంటే ఇప్పట్లో చెప్పలేమనే సమాధానం వస్తోంది. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన మూడు సినిమాలు వాయిదా పడ్డాయి. ఇందులో టక్ జగదీష్ కి విరాటపర్వానికి మంచి బజ్ ఉంది. అయితే సీటీమార్ సినిమా కూడా బాగానే ఉంటుంది అని భావిస్తున్నారు. దీనికి ముందు లవ్ స్టోరీ మూవీ కూడా రిలీజ్ కావాల్సింది ఆగిపోయింది. మొత్తానికి ఈ సినిమాలు మాత్రం కరోనా తగ్గాక ఎపుడైనా రిలీజ్ అవుతాయి అని అంటున్నారు.

ఆ తరువాత మాత్రం పెద్ద సినిమాలు క్రేజీ సినిమాల కోసం ఎదురుచూడాల్సిందే అంటున్నారు. మే నెలలో రిలీజ్ డేట్ ఇచ్చినా కూడా మెగాస్టార్ ఆచార్య మూవీ ఇంకా షూటింగ్ పార్ట్ కొంత ఉంది. అలాగే బాలయ్య అఖండ మూవీ కూడా కొంత షూటింగ్ ఉందని అంటున్నారు. ఇక మాస్ మహారాజా వెంకటేష్ సినిమా కూడా షూటింగ్ పార్ట్ డైరెక్టర్ రమేష్ వర్మకు కరోనా కారణంగా ఆగిపోయింది. మొత్తానికి చూసుకుంటే మే నెల సినిమాలే కాదు జూన్ లో రావాల్సిన కొన్ని పెద్ద హీరో సినిమాలు కూడా ఇంకా షూటింగ్  దశలోనే ఉన్నాయి. మరి కరోనా తగ్గితేనే అవి షూటింగ్ జరుపుకుని థియేటర్ దాకా వచ్చేది. అందువల్ల మిడిల్ రేంజి సినిమాలతోనే సినిమా హాళ్ళు మళ్ళీ కొంతకాలం కధ నడపాల్సి ఉంటుంది. ఒక వేళ అవి ఫట్ అయితే మాత్రం థియేటర్లో ఈగలు తోలుకోవాల్సిందే అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షమించండి.. తెలియక చేశానంటూ.. 1710 వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ..!

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>