MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indian-2-sequel-updates7a747588-464b-4d28-9e9c-4dcd02860fb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indian-2-sequel-updates7a747588-464b-4d28-9e9c-4dcd02860fb7-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు కమల హాసన్ ద్విపాత్రాభినయం చేసిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనం. అవినీతిపై శంకర్ సంధించిన బాణమే ఈ భారతీయుడు. ఈ సినిమా గురించి ఇప్పటికీ మనము చెపుకుంటున్నామంటే అదంతా దర్శకుడి పని తీరు కమల హాసన్ నటనే కారణం. INDIAN 2 SEQUEL UPDATES;kamal hassan;shankar;vivek;korcha;cinema;court;director;chennaiశంకర్ సినిమాపై కోర్ట్ సంచలన తీర్పు...?శంకర్ సినిమాపై కోర్ట్ సంచలన తీర్పు...?INDIAN 2 SEQUEL UPDATES;kamal hassan;shankar;vivek;korcha;cinema;court;director;chennaiFri, 23 Apr 2021 11:00:00 GMTలోకనాయకుడు కమల హాసన్ ద్విపాత్రాభినయం చేసిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనం. అవినీతిపై శంకర్ సంధించిన బాణమే ఈ భారతీయుడు. ఈ సినిమా గురించి ఇప్పటికీ మనము చెపుకుంటున్నామంటే అదంతా దర్శకుడి పని తీరు కమల హాసన్ నటనే కారణం. ఈ ట్రెండ్ లో సీక్వెల్ సినిమాల జోరు సాగుతూ ఉంది. అందుకే గతంలో ఒకసారి ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అనుకున్నారు. ఈ సినిమాను లైకా నిర్మాణసంస్థ ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించింది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, ఈ సినిమా షూటింగు ప్రారంభం అయినప్పటి నుండి మొన్న షూటింగు ఆగిపోయే వరకు అన్నీ వివాదాలే. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ...అసలైన కారణంగా డైరెక్టర్ శంకర్ పైనే లైకా నిర్మాణ సంస్థ చెన్నై హై కోర్టులో కేసు వేయడం జరిగింది.

కానీ వాస్తవంగా చూస్తే శంకర్ తప్పేమి లేదని చెప్పాలి. కమల్ హాసన్ రాజకీయాలల్తో బిజీ గా ఉండడం వలన షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఇంకో సారి షూటింగ్ సమయంలో క్రేన్ ఆక్సిడెంట్ జరిగింది. దీనితో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. లైకా వారు పెట్టిన కేసులో మా సినిమాను చేస్తామని ఒప్పుకున్న తరువాత పూర్తి కాకుండానే వేరే సినిమాను చేయడం సమంజసం కాదని పిటీషన్ వేసింది. ఇప్పటికే మేము ఈ సినిమాపై 236 కోట్లు ఖర్చు చేశామని...డైరెక్టర్ పారితోషికంగా 14 కోట్లు కూడా ముట్టచెప్పామని తెలియచేయడం జరిగింది. అయితే శంకర్ కూడా కోర్ట్ వారికి తన వాదనలను వివరించాడు.

మొన్ననే చనిపోయిన నటుడు వివేక్ పై తీసిన షాట్ లన్నీ మళ్ళీ రీ షూట్ చేయాలని, దీనికి గాను మరికొంత సమయం పట్టే అవకాశముందని కోర్టుకు తెలియచేశారు. ఇరువురు వాదనలు విన్న తరువాత ఈ విషయంపై తీక్షణంగా ఆలోచించిన హై కోర్టు, ఇరువురు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుందని సలహా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ఈ కేసు ఏప్రిల్ 28 కి వాయిదా వేశారు. అసలు ఈ సినిమా భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు. కాగా శంకర్ తరువాత ఎటువంటి స్టెప్ తీసుకోనున్నాడో తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ నేత అరెస్ట్ పై బాబు రియాక్షన్ ఇది

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>