CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cooking7099b9c1-ff3a-4825-b524-1303bc7bf2c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cooking7099b9c1-ff3a-4825-b524-1303bc7bf2c0-415x250-IndiaHerald.jpgచాల మంది ఎక్కువగా బయటి ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బయటి ఫుడ్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది బయట తినే ఫుడ్ ని ఇంట్లోనే తాయారు చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఇంట్లోనే రుచికరమైన నువ్వుల పులావు ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దామా. india-herald-cooking;mirchi;oil;garlic;cumin;dried red chillies;mixie;hingరుచికరమైన నువ్వుల పులావు ఇలా తయారు చేయండి..!రుచికరమైన నువ్వుల పులావు ఇలా తయారు చేయండి..!india-herald-cooking;mirchi;oil;garlic;cumin;dried red chillies;mixie;hingFri, 23 Apr 2021 12:00:00 GMTచాల మంది ఎక్కువగా బయటి ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బయటి ఫుడ్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది బయట తినే ఫుడ్ ని ఇంట్లోనే తాయారు చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఇంట్లోనే రుచికరమైన నువ్వుల పులావు ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దామా.

నువ్వుల పులావుకు కావాల్సిన పదార్దాలు:

మినప్పప్పు - ఒక టేబుల్ ‌స్పూన్‌, శనగపప్పు - ఒక టేబుల్ ‌స్పూన్‌, ఎండుమిర్చి - మూడు, కరివేపాకు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నువ్వులు - మూడు టేబుల్ ‌స్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి - రెండు టేబుల్ ‌స్పూన్లు, నూనె - సరిపడా, ఆవాలు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, బియ్యం - ఒకటిన్నర కప్పు.

ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి సిద్ధంగా పెట్టుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఎండుకొబ్బరి వేసి కలపాలి. కాసేపు వేగించి దింపాలి. అవి చల్లారిన తరువాత మిక్సీ జాడులోకి వేసి పొడి చేసుకోవాలి.

ఇక ఇప్పుడు స్టవ్‌ పై మళ్లీ పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కొంచెం వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. మినప్పప్పు వేగిన తరువాత కరివేపాకు, ఇంగువ వేసుకుని దింపాలి. ఇక ఇందులో నువ్వుల పొడి, తగినంత ఉప్పు వేయాలి. వండి అన్నం తీసుకుని అందులో ఈ మిశ్రమం కావలసినంత వేసుకుని కలపాలి. ఈ రుచికరమైన ఈ నువ్వుల పులావును ఇతర కూరలతో లేదా పెరుగుతో సర్వ్‌ చేయాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: బిహార్‌లో ఘోర ప్రమాదం..!!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>