PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus57c934f0-75ad-4daf-a119-5da1932a50fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus57c934f0-75ad-4daf-a119-5da1932a50fa-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక మహమ్మారి కరోనా. ఎవరి నోట విన్నా కరోనా మాటలే.. ఎక్కడ చూసినా కరోనా వార్తలే. ఈ మాయదారి వైరస్ మన దేశానికి వచ్చి ఏడాది దాటిపోయింది.. ఎప్పుడు పూర్తిగా ఈ ప్రపంచాన్ని విడిచి పెడుతుందో అన్న ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. CORONAVIRUS;mithra;marriage;silverతాళికట్టు శుభవేళ.. మెడకో కరోనా డోలా...?తాళికట్టు శుభవేళ.. మెడకో కరోనా డోలా...?CORONAVIRUS;mithra;marriage;silverFri, 23 Apr 2021 12:34:58 GMTప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక మహమ్మారి కరోనా. ఎవరి నోట విన్నా కరోనా మాటలే.. ఎక్కడ చూసినా కరోనా వార్తలే. ఈ మాయదారి వైరస్ మన దేశానికి వచ్చి ఏడాది దాటిపోయింది.. ఎప్పుడు పూర్తిగా ఈ ప్రపంచాన్ని విడిచి పెడుతుందో అన్న ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. కనీసం అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నో పనులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ గురించి చర్చ మొదలైంది. మే నుంచి మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమవుతుంది. 2021 లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే కనిపిస్తోందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఉన్న ముహూర్తాల లోనే త్వరపడాల్సి ఉంటుంది.

ఇప్పుడు రాబోయేది పెళ్లిళ్ల సీజన్, మే నెల నుండి వివాహాలకు ముహుర్తాలు ఉన్నాయి. పెళ్లి అంటేనే ఎంతో సాంప్రదాయబద్ధంగా బంధుమిత్రులతో, ఆత్మీయుల మధ్య ఇద్దరు వ్యక్తులు ఒకటిగా ముడిపడే ఒక గొప్ప వేడుక. అయితే కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో, బంధుమిత్రుల మాట అటుంచితే కనీసం రెండు కుటుంబాలు కలిసి పెళ్లి వేడుక జరపడం కూడా ప్రమాదమే అంటున్నారు విశ్లేషకులు. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ... కరోనా మహమ్మారి ప్రభావం మరింత పెరిగిన ఈ విపత్కర సమయంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేయగలిగితేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు లాక్‌డౌన్‌ పెట్టే సూచనలు ఉన్నాయి. కళ్యాణ మండపాలు కూడా ఆంక్షలు విధించేలా కనిపిస్తోంది.

మరి ఇలాంటి సందర్భంలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కష్ట కాలమే చెప్పాలి. ఏదేమైనా ఇంకొద్ది  రోజులు ఆగి పరిస్థితి కాస్త సద్దుమణిగాక పెళ్లిళ్ల విషయం ఆలోచిస్తే మంచిదంటున్నారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో బంగారం వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఏదేమైనా వివాహాలు జరిగితే ప్రమాదం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం వుంది. కాబట్టి పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారు వెనుకడుగు వేస్తున్నారని చెప్పాలి.  గొప్ప వారు అయితే కొద్ది కాలం వేచి చూసే అవకాశముంది. ఎందుకంటే వారు పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించాలని కలలు కానీ ఉంటారు. కానీ సామాన్యులకు మాత్రం ఇదే అనువైన సమయం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాహ ముహుర్తాలు ఎవరికీ అనుకూలంగా మారుతాయో...? వీటి వలన ఎన్ని కరోనా కేసులు రానున్నాయో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>