Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-testa9442b03-d963-49e2-84e7-ce172bd6bc07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-testa9442b03-d963-49e2-84e7-ce172bd6bc07-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండటం.. అటు ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణా చర్యలు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రజలు మరింత ప్రాణభయం పెరిగిపోతుంది. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ టెస్ట్ చేసుకోవడానికి ఎంతో మంది భయపడేవారు కానీ నేటి రోజుల్లో మాత్రం కరోనా అంటే అవగాహన వచ్చిన నేపథ్యంలో ఇక వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చCorona test;tiru;telangana;coronavirusకని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?Corona test;tiru;telangana;coronavirusFri, 23 Apr 2021 09:30:00 GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండటం.. అటు ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణా చర్యలు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రజలు మరింత ప్రాణభయం పెరిగిపోతుంది. అయితే ఒకప్పుడు కరోనా వైరస్  టెస్ట్ చేసుకోవడానికి ఎంతో మంది భయపడేవారు కానీ నేటి రోజుల్లో మాత్రం కరోనా అంటే  అవగాహన వచ్చిన నేపథ్యంలో ఇక  వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటున్నారు.



 ఇక తద్వారా తమకు కరోనా ఉందా లేదా అని తెల్సుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు ఎంతో మంది ప్రజలు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆలోచనల కంటే ఇంకా వెనుకబడే ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ప్రస్తుతం కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవడానికి ఆసుపత్రులకు వెళుతూ ఉంటే అటు ఆస్పత్రిలలో మాత్రం చాలా సెంటర్లలో యాంటిజెన్ కిట్ల కొరత ఏర్పడుతున్నది. దీంతో కరోనా వైరస్ టెస్ట్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.  ఇక ఎంతో మంది ప్రజలు కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళితే అక్కడికి వచ్చిన వారు అందరికి కరోనా టెస్ట్ చేయించడానికి కిట్లు అందుబాటులో లేవు అన్నది తెలుస్తుంది.



 దీంతో ఎంతో మంది వైరస్ లక్షణాలు ఉండగా కరోనా వైరస్ చేసుకోవడానికి వచ్చి చివరికి కిట్లు  లేకపోవడంతో టెస్ట్ చేయించుకోకుండా వెను తిరుగుతున్నారు.  ఈ నేపథ్యంలో ఇక వారికి కరోనా ఉన్నప్పటికీ జన సమూహం లోనే తిరుగుతున్నారు. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం ఏకంగా అందరికీ కరోనా వైరస్ పాకి పోయేలా చేస్తుంది అని విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అటు కరోనా వైరస్ టెస్ట్ చేసుకోవడానికి వచ్చిన ప్రజలందరినీ కూడా భౌతిక దూరం పాటించేలా చూడటం లో ఆసుపత్రి సిబ్బంది విఫలం అవుతున్నట్లు తెలుస్తుంది. తద్వారా ఆస్పత్రులు కూడా  వైరస్ వ్యాప్తికి కారకాలుగా మారిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం మరింత దారుణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>