KidsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/kids-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/kids-IndiaHerald.jpgహంసానందిని రాజ్యాన్ని పరిపాలించే చిత్రసేన మహారాజుకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక నెల రోజుల పాటు మారువేషంలో ఒంటరిగా రాజ్య పర్యటన చేయాలని అనుకున్నాడు. తాను వచ్చేంత వరకు రాజ్యపాలన చూడమని మంత్రిని ఒప్పించి గుర్రాల వ్యాపారి వేషంతో అర్ధరాత్రి ఎవరి కంటాపడకుండా అంతఃపురాన్ని విడిచి ఒంటరిగా వెళ్లాడు. ఇలా మహారాజు మారువేషంలో చాలా ఊర్లు తిరిగాడు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశాడు. అధికారుల అవినీతినీ గమనించాడు.Story,;dharma;hamsa nandini;santoshi;vedhika;korcha;panchayati;fatherనా మాటే శాసనం........!నా మాటే శాసనం........!Story,;dharma;hamsa nandini;santoshi;vedhika;korcha;panchayati;fatherFri, 23 Apr 2021 18:31:00 GMTహంసానందిని రాజ్యాన్ని పరిపాలించే చిత్రసేన మహారాజుకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక నెల రోజుల పాటు మారువేషంలో ఒంటరిగా రాజ్య పర్యటన చేయాలని అనుకున్నాడు. తాను వచ్చేంత వరకు రాజ్యపాలన చూడమని మంత్రిని ఒప్పించి గుర్రాల వ్యాపారి వేషంతో అర్ధరాత్రి ఎవరి కంటాపడకుండా అంతఃపురాన్ని విడిచి ఒంటరిగా వెళ్లాడు. ఇలా మహారాజు మారువేషంలో చాలా ఊర్లు తిరిగాడు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశాడు. అధికారుల అవినీతినీ గమనించాడు.
ఒక రోజు ఉదయానికి రామాపురం అనే గ్రామానికి చేరుకున్నాడు. ధర్మవేదిక దగ్గర చాలా మంది గుమిగూడారు. వాళ్లను చూసి తాను కూడా అక్కడకు వెళ్లాడు. వేదిక మీద ధర్మాధికారి కూర్చున్నాడు. ‘ఈ రోజు సమస్య చెప్పండి’ అన్నాడు అధికారి. జనాల మధ్య నుంచి గోపయ్య ధర్మ వేదిక దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పాడు. ‘మా నాన్న గుర్రాల వ్యాపారం చేసేవారు. నేను పుట్టినప్పుడు మాకు రెండు గుర్రాలుండేవి. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు పుట్టారు. మా ఆస్తి పంపకాల నాటికి గుర్రాల సంఖ్య వందకు చేరింది. మా నాన్న మా ముగ్గురికి తలా ముప్ఫై గుర్రాలు పంచేసి, మిగిలిన పది గుర్రాలు నాకు అదనంగా ఇచ్చాడు’
‘నీకే ఎందుకు ఎక్కువ ఇచ్చాడు’ ప్రశ్నించాడు అధికారి. ‘నేను మా నాన్నను అడగలేదు. నేను పెద్దోడినని, నాన్నకు వ్యాపారంలో సహకరించి, గుర్రాల సంఖ్య పెంచినందుకు ఇచ్చాడు’ అని చెప్పాడు గోపయ్య.
‘ఇది అన్యాయం. తండ్రి ఆస్తి మీద మా ముగ్గురికి సమాన హక్కు ఉండాలి. కాబట్టి ఆ పది గుర్రాల్లోనూ మాకు వాటా కావాలి’ అన్నారు గోపయ్య తమ్ముళ్లు. ‘నిజమే కదా!’ అన్నాడు అధికారి. ‘అయ్యా! గుర్రాల పంపకం రోజున మా తమ్ముళ్ల అంగీకారంతోనే మా నాన్న ఇచ్చారు. నెల రోజుల కిందటే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇలా బెదిరించి గుర్రాలను తీసుకెళ్లడం న్యాయమా?’ అడిగాడు గోపయ్య.
ముగ్గురూ వారి వాదనలు వినిపించారు. ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్న మహారాజుకు ముగ్గురి వాదనల్లోనూ న్యాయం ఉందనిపించింది. తీర్పు ఎలా చెబుతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ధర్మాధికారి కొద్దిసేపు ఆలోచించి తీర్పు రేపు చెబుతాను అని చెప్పి వెళ్లిపోయాడు.
రోజుకు రెండు, మూడు గ్రామాలు పర్యటించే మహారాజు ఈ తీర్పేంటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ రోజు అక్కడే బస చేశాడు. మరుసటి రోజు ధర్మవేదిక దగ్గర పంచాయతీ ప్రారంభమైంది. ధర్మాధికారి తీర్పు చదవడం ప్రారంభించారు.
‘గోపయ్య వ్యాపారంలో అడుగుపెట్టి తండ్రికి సహకరించే నాటికి వారి ఆస్తి ముప్పై గుర్రాలు. రెండో కొడుకు వ్యాపారం ప్రారంభించే నాటికి వారి గుర్రాలు అరవైకి చేరాయి. చివరి కొడుకు తండ్రికి సహకరించే నాటికి గుర్రాల సంఖ్య డెబ్బయ్ పంపకం నాటికి వంద అని నా విచారణలో తెలిసింది. ముగ్గురు సోదరులు అవునని ఒప్పుకొన్నారు.
‘తండ్రి ఆస్తిలో కొడుకులకు సమాన వాటాలు ఇవ్వడమే న్యాయం. గోపయ్య వ్యాపారంలోకి రావడానికి ముందున్న ముప్పై గుర్రాల్లో తలా పది గుర్రాలు తీసుకోవాలి. చిన్న కొడుకు వ్యాపారం ఆరంభించిన నాటి నుంచి పంపకాల వరకు సంపాదించిన ముప్పై గుర్రాల్లో తలా పది గుర్రాలు తీసుకోవాలి. మిగిలిన గుర్రాలు వ్యాపారంలో వారి వారి సామర్థ్యాన్ని బట్టి సంపాదించారు కాబట్టి అవి వారికే చెందుతాయి. గోపయ్యకు ఉమ్మడి ఇరవై గుర్రాలతో పాటు తాను సంపాదించిన ముప్పై గుర్రాలు, పెద్ద సోదరుడితో కలిసి సంపాదించిన పది గుర్రాల్లో అయిదు ఇవ్వాలి. ఇదే నా తీర్పు’ అని చెప్పాడు ధర్మాధికారి.
గోపయ్యకు యాభై అయిదు, రెండో వాడికి ఇరవై అయిదు. చివరి వాడికి ఇరవై గుర్రాలు వచ్చినట్లుగా అందరూ లెక్కలు వేశారు. గోపయ్య సోదరులు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ తాము కోల్పోయిన గుర్రాలను తలచుకుని బాధపడుతున్నారు. తనకు అదనంగా వచ్చిన పదిహేను గుర్రాలు తన సోదరులకే ఇవ్వమని తమ్ముళ్ల పరిస్థితికి జాలి పడి గోపయ్య ధర్మాధికారితో చెప్పాడు. ‘నా మాటే శాసనం. నా తీర్పు పాటించి తీరాలంతే’ అని ధర్మాధికారి ఖరాఖండిగా చెప్పేశాడు.
తండ్రి నిర్ణయాన్ని అత్యాశతో అవమానించి, గోపయ్యను పంచాయతీకి తీసుకువచ్చిన సోదరులిద్దరికి తగిన శిక్ష పడిందని ప్రజలు సంతోషించారు. మహారాజు ధర్మాధికారిని మనసులోనే అభినందించాడు. పర్యటన పూర్తైన తర్వాత ఆయన్ను రాజదర్బారుకు పిలిపించుకుని సత్కరించాడు. చిత్రసేన మహారాజు ధర్మాధికారిని తన న్యాయసలహాదారుగా నియమించాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్.. ఏపీలో పెన్షనర్లకు గండం

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>