EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-and-jagan-feeling-the-heat-of-covid-vaccine-for-all-peopledf2389d8-657b-4e2f-863e-2af30a7dd14c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-and-jagan-feeling-the-heat-of-covid-vaccine-for-all-peopledf2389d8-657b-4e2f-863e-2af30a7dd14c-415x250-IndiaHerald.jpgవ్యాక్సిన్ ధరల్లో తేడాలపై దేశంలో బాగా ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకు ఫ్రీగా వేయకుండా ధర పెట్టడం ఏమిటంటు మండిపోతున్నారు. వ్యాక్సిన్ కోసమని బడ్జెట్లో రు. 35 వేల కోట్లు కేటాయించిన కేంద్రం మళ్ళీ ఇపుడు ధరలు నిర్ణయించటంపై ప్రతిపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ నేపద్యంలోనే తమ రాష్ట్రాల్లో వయసుతో సంబంధంలేకుండా అందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వేయిస్తామంటు ప్రకటిచటం మొదలుపెట్టాయి. మొదటగా అస్సాం చేసిన ప్రకటనను ఇపుడు దాదాపు 12 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేరళ, సcorona vaccine covid 19 jagan kcr modi 18 years oxygen;kcr;yajamanya;kerala;sambandam;madhya pradesh - bhopal;telugu;cm;central governmentహెరాల్డ్ ఎడిటోరియల్ : తెలుగు సీఎంలపై పెరిగిపోతున్న ఒత్తిడిహెరాల్డ్ ఎడిటోరియల్ : తెలుగు సీఎంలపై పెరిగిపోతున్న ఒత్తిడిcorona vaccine covid 19 jagan kcr modi 18 years oxygen;kcr;yajamanya;kerala;sambandam;madhya pradesh - bhopal;telugu;cm;central governmentFri, 23 Apr 2021 03:00:00 GMTతెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరిపైనా ఒత్తిడి పెరిగిపోతోంది. 18 ఏళ్ళు నిండినవారు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని కేంద్ర ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలనుండి విపరీతమైన డిమాండ్లు పెరిగిపోతున్నాయి. 45-60 ఏళ్ళమధ్య వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి అవసరాలకే వ్యాక్సిన్లు అందటంలేదు. వీళ్ళకి అదనంగా 18 ఏళ్ళు నిండినవారికి కూడా వ్యాక్సిన్లు అనేటప్పటికి ఫార్మా కంపెనీల మీదే కాకుండా కేంద్రప్రభుత్వం మీదకూడా ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే తాము తయారుచేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన ధరను సీరమ్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు రు. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రు. 600 అంటు ధరలను ప్రకటించింది. అప్పటినుండి దేశవ్యాప్తంగ గోల మొదలైపోయింది.




వ్యాక్సిన్ ధరల్లో తేడాలపై దేశంలో బాగా ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకు ఫ్రీగా వేయకుండా ధర పెట్టడం ఏమిటంటు మండిపోతున్నారు. వ్యాక్సిన్ కోసమని బడ్జెట్లో రు. 35 వేల కోట్లు కేటాయించిన కేంద్రం మళ్ళీ ఇపుడు ధరలు నిర్ణయించటంపై ప్రతిపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ నేపద్యంలోనే తమ రాష్ట్రాల్లో వయసుతో సంబంధంలేకుండా అందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వేయిస్తామంటు ప్రకటిచటం మొదలుపెట్టాయి.  మొదటగా అస్సాం చేసిన ప్రకటనను ఇపుడు దాదాపు 12 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేరళ, సిక్కిం, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ లాంటి రాష్ట్రాలు ఉచిత వ్యాక్సిన్ను ప్రకటించాయి.




దాంతో కేసీయార్, జగన్మోహన్ రెడ్డిపైనా అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తెలుగురాష్ట్రాల్లో కూడా అందరికీ ఉచిత వ్యాక్సిన్లు వేయించాలంటు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ల ధరల తేడాపై ఇప్పటికే తెలంగాణాలో కేటీయార్ తన ట్విట్టర్లో నిరసన ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే అవసరానికి సరిపడా వ్యాక్సిన్లు సరఫరా అవటంలేదు. అలాంటిది 18 ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సిన్లంటే మొదటికే మోసం వచ్చేస్తుందేమో తెలీటంలేదు. ఏదేమైనా మిగిలిన రాష్ట్రాల నిర్ణయాల తర్వాత తెలుగురాష్ట్రాల్లో కూడా  ఉచితంపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : ఆ లక్షణాలు ఉంటే డాక్టర్‌ పర్యవేక్షణ తప్పనిసరి.. డేంజర్‌..!

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?

జూన్ - జులై లో థియేటర్ల కోసం పోటీ మాములుగా ఉండదు...!

ఏపీనే ఫస్ట్... ఆక్సీజన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం

గుండె జారే న్యూస్ చెప్పిన ఈటెల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>