PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhe-pollc516e143-57ef-471b-bfbc-95523df3c6be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhe-pollc516e143-57ef-471b-bfbc-95523df3c6be-415x250-IndiaHerald.jpgఎన్నికలు రాజకీయాలు ఇవే ఇపుడు భారతాన ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిజానికి కరోనా ఇంతటి విసృతమైన రూపం తీసుకోవడానికి ఎన్నికలు ప్రధాన కరణమని కూడా అంతా తేల్చారు. సరే ఎన్నికలు రాజకీయాలు రెండూ కవల పిల్లలు. కాబట్టి వాటిని ఎవరూ విడదీయలేరు. bhe poll;tiru;2019;district;kadapa;tirupati;assembly;mla;doctor;husband;tdp;local language;ycp;partyమరో ఉప ఎన్నిక కోసం కత్తులు దూస్తున్నారు...?మరో ఉప ఎన్నిక కోసం కత్తులు దూస్తున్నారు...?bhe poll;tiru;2019;district;kadapa;tirupati;assembly;mla;doctor;husband;tdp;local language;ycp;partyFri, 23 Apr 2021 16:38:00 GMTఎన్నికలు రాజకీయాలు ఇవే ఇపుడు భారతాన ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిజానికి కరోనా ఇంతటి విసృతమైన రూపం తీసుకోవడానికి ఎన్నికలు ప్రధాన కరణమని కూడా అంతా తేల్చారు. సరే ఎన్నికలు రాజకీయాలు రెండూ కవల పిల్లలు. కాబట్టి వాటిని ఎవరూ విడదీయలేరు.

ఏపీలో చూసుకుంటే ఇంకా చాలానే ఎన్నికలు పెండింగులో ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు ముగిశాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగిపోయింది. దాని ఫలితాలు ఇక రావాలి. ఇంతలో కడప జిల్లా బద్వేల్ ఉప ఉన్న ఎన్నిక దూసుకువస్తోంది. అక్కడ కరోనాతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణం చెందారు. దాంతో మరో అయిదు నెలలలో అక్కడ ఎన్నిక అనివార్యంగా జరగాలి.

అదే విధంగా చూసుకుంటే రాజమండ్రీ, శ్రీకాకుళం సహా కొన్ని కార్పొరేషన్ ఎన్నికలు పెండింగులో ఉన్నాయి. అలాగే అనేక మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాలి. ఇవన్నీ ఇలా ఉంటే ముందు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా అపుడే పావులు కదుపుతున్నాయి.

వెంకటసుబ్బయ్య మరణంతో ఈసారి ఆయన కుటుంబానికే  టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. 2019 ఎన్నికల్లో కడపను మొత్తానికి మూత్తం క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. అందులో బద్వేల్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే కచ్చితంగా వైసీపీ గెలవడం ఖాయం, కానీ అదే సమయంలో అంత సులువుగా వైసీపీకి ఈ సీటు వదిలిపెట్టడానికి టీడీపీ సిధ్ధంగా లేదుట. దానికి కారణం ఆ పార్టీకి కూడా బలం ఉండడమే.

ఇక్కడ నుంచి 1983, 1985, 1994, 1999 లలో నాలుగు సార్లు టీడీపీ గెలిచింది. పైగా ఆ పార్టీ ట్రాక్ రికార్డ్ కూడా ఇక్కడ బాగుంది. దాంతో తొందరలోనే ఇక్కడ ఉన్న టీడీపీ నేతలతో చంద్రబాబు జూమ్ మీటింగ్ పెట్టి మరీ ఎన్నికలకు వారిని సిధ్ధం చేయడానికి చూస్తున్నారు అంటున్నారు మొత్తానికి మరో ఉప ఎన్నిక కోసం రంగస్థలం వేడిగా వాడిగా వెయిట్ చేస్తోంది అనుకోవాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొడుకులే తల్లికి రెండో పెళ్లి చేయనున్నారా...సీనియర్ నటి స్పందన ఇదే ...?

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>