PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus34a1f13e-ef96-4c23-85bd-e7a43f8daed1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus34a1f13e-ef96-4c23-85bd-e7a43f8daed1-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఒడిశా నుంచి ఆక్సిజన్ తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానంలో ఆక్సిజన్ ను తెప్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు విమానాలు బయలుదేరాయి. ఈ ఏర్పాట్లను ఈటెల రాజేందర్, సోమేష్ కుమార్ పర్యవేక్షించారు. రోడ్డు మార్గంలో తెప్పిస్తే ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో త్వరగా తెప్పించడానికి విమానాలను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో తెప్పిస్తే మూcorona virus;ktr;kumaar;eatala rajendar;odisha;telangana;steel plant;minister;central government;oxygen;ballari;petta;etela rajenderకని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !corona virus;ktr;kumaar;eatala rajendar;odisha;telangana;steel plant;minister;central government;oxygen;ballari;petta;etela rajenderFri, 23 Apr 2021 14:00:00 GMTతెలంగాణలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఒడిశా నుంచి ఆక్సిజన్ తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానంలో ఆక్సిజన్ ను తెప్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు విమానాలు బయలుదేరాయి. ఈ ఏర్పాట్లను ఈటెల రాజేందర్, సోమేష్ కుమార్ పర్యవేక్షించారు. రోడ్డు మార్గంలో తెప్పిస్తే ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో త్వరగా తెప్పించడానికి విమానాలను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో తెప్పిస్తే మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని, విమానాల్లో అయితే ఈరోజు సాయంత్రానికి చేరుకుంటాయిని చెబుతున్నారు. 

ఇక ఆక్సిజన్ తెప్పించడానికి కృషి చేస్తున్న ఈటెల రాజేందర్ ను, సోమేష్ కుమార్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇక ఈ క్రమంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారని అయినా సరిపోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించిందని, కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి ఉన్నాయని, మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్‌, అంగుల్‌ (ఒడిశా), పెరంబుదూర్‌ నుంచి తీసుకోవాలని సూచించిందని అన్నారు. 

తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్‌ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్‌ టన్నులేనని వైజాగ్‌ నుంచి దాదాపు ఇంతే కేటాయించారని అన్నారు. కానీ భిలాయ్‌, పెరంబుదూర్‌, అంగుల్‌ నుంచి ఆక్సిజన్‌ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు కావడంతో ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్‌ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను రాష్ట్రం వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. ఇక ఇలా విమానాల ద్వారా ఇంత భారీ ఎత్తున ఆక్సిజన్ తరలించడం ఇదే మొదటి సారి అని ఆయన పేర్కొన్నారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైద‌రాబాద్ గాలిలో క‌రోనా వైర‌స్‌?

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>