చల్లని కబురు: మరో మూడ్రోజులపాటు ఏపీలో వర్షాలు, తిరుపతిలో పిడుగులు పడే అవకాశం

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఒరిస్సా, దాని పరిసరాలలో సగటున సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని తెలిపింది.

శుక్రవారం, శనివారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారంనాడు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. యానాంలో కూడా వర్షాలు పడతాయని వెల్లడించింది.

Three more days Rains across the Andhra Pradesh bring temperature down

శుక్రవారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసమీలోనూ వర్షాలు కురియనున్నాయని తెలిపింది.

శుక్ర, శనివారాల్లో రాయలసీమలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారంనాడు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతిలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పిడుగులుపడే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఏపీతోపాటు తమిళనాడు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *