BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/menkyur-fingers-hand76a32259-1746-4df2-8cd3-17dba314d1c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/menkyur-fingers-hand76a32259-1746-4df2-8cd3-17dba314d1c5-415x250-IndiaHerald.jpgముఖ్యంగా అందం అంటే శరీరం నాజూకుగా, ముఖం మచ్చలులేని రహితంగా ఉండడమే కాదు , కాళ్ళు ,చేతులు కూడా అందంగా ఉండాలి .అప్పుడే అందమైన వారు అని పిలవడానికి వీలుగా ఉంటుంది. చూసిన వారు అబ్బుర పోతారు.. అందుకోసమే ఇన్ని రోజులు చాలా మంది పెడిక్యూర్ కోసం ఎన్నో రకాల చిట్కాలను పాటించారు. ఇక అలాగే ఇప్పుడు చేతుల కోసం మెనిక్యూర్ అందుబాటులోకి వచ్చింది. పెడిక్యూర్ కాళ్ల అందాన్ని పెంపొందిస్తే, మెనిక్యూర్ చేతివేళ్ల అందాన్ని పెంపొందిస్తుంది.. అయితే ఈ మెనిక్యూర్ ను ఎలా చేస్తారో.. దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయో ..ఇప్పుడు ఇక్కడ చMENKYUR FINGERS HAND;taraమెనిక్యూర్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..మెనిక్యూర్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..MENKYUR FINGERS HAND;taraFri, 23 Apr 2021 14:20:00 GMT
ముఖ్యంగా అందం అంటే శరీరం నాజూకుగా, ముఖం మచ్చలులేని రహితంగా ఉండడమే కాదు , కాళ్ళు ,చేతులు కూడా అందంగా ఉండాలి .అప్పుడే అందమైన వారు అని పిలవడానికి వీలుగా ఉంటుంది. చూసిన వారు అబ్బుర పోతారు.. అందుకోసమే ఇన్ని రోజులు చాలా మంది పెడిక్యూర్ కోసం ఎన్నో రకాల చిట్కాలను పాటించారు. ఇక అలాగే ఇప్పుడు చేతుల కోసం  మెనిక్యూర్ అందుబాటులోకి వచ్చింది. పెడిక్యూర్ కాళ్ల అందాన్ని పెంపొందిస్తే, మెనిక్యూర్ చేతివేళ్ల అందాన్ని పెంపొందిస్తుంది.. అయితే ఈ మెనిక్యూర్ ను ఎలా చేస్తారో.. దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయో ..ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం...


ముందుగా మెనిక్యూర్ చేసేటప్పుడు చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పెయింట్ ను తుడిచివేస్తారు. తరువాత గోళ్ళను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి,  ట్రిమ్ చేస్తారు.  ఇలా రెండు చేతుల గోళ్లను  ట్రిమ్ చేశాక,  ఒక గిన్నెలో సోప్ వాటర్ ను తీసుకొని,  దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్  , గ్లిజరిన్ , నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి పదినిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడంవల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి, గరుకుగా ఉండే క్యూటికల్స్ మెత్తగా తయారవుతాయి. ఇక ఆ తరువాత గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. ఇక అరచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్ చేస్తారు..

ఇక ఆ తర్వాత పొడి టవల్ తో తడి లేకుండా తుడిచి వేస్తారు . క్యూటికల్ రిమూవర్ తో గోరుచుట్టు ఇంకా ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే వాటిని తొలగిస్తారు. ఇక దీని వల్ల గోర్లు అందంగా పొడువుగా కనిపిస్తాయి. ఇక ఆ తరువాత చేతులను శుభ్రంగా తుడిచి, మాయిశ్చరైజర్ తో చేతులకు వేళ్లకు మర్దనా  చేస్తారు. ఇలా పదిహేను రోజులకు ఒకసారి మెనిక్యూర్ చేయడం వల్ల చేతులు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.. ఇలా మెనిక్యూర్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. గోళ్లకు రక్త ప్రసరణ బాగా జరగడంతో వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి .అంతేకాకుండా గోళ్ళకు కూడా పుష్కలంగా పోషకాలన్నీ  అంది పెరుగుదల మంచిగా ,  మరింత కాంతివంతంగా ఉంటాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": ఢిల్లీలో కంట్రోల్ తప్పిన కరోనా.. "ఓపెన్ ఐసీయూ"లో పేషంట్లు..!!

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>