PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5e5952f0-48fb-46a3-a1bb-3d66cea46f32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5e5952f0-48fb-46a3-a1bb-3d66cea46f32-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు ఆస్పత్రులు అలాగే తెలంగాణలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రజలను వేధిస్తున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రజలను అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్న కొన్ని ఆస్పత్రుల్ విషయంలో ఇప్పుడు అధికారులు అలాగే ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా కూడా దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రముఖులకు చెందిన కొన్ని ఆస్పత్రుల్లో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని కరోనాకు మందు లేకపోయినా సరే అనేక రూపాల్లో ప్రజల నుంచjagan,ycp,ap;editor mohan;bharatiya janata party;jagan;vijayawada;andhra pradesh;chief minister;letter;ycp;oxygen;sv mohan reddy;reddyప్రైవేట్ ఆస్పత్రుల తాట తీస్తా అంటున్న జగన్...?ప్రైవేట్ ఆస్పత్రుల తాట తీస్తా అంటున్న జగన్...?jagan,ycp,ap;editor mohan;bharatiya janata party;jagan;vijayawada;andhra pradesh;chief minister;letter;ycp;oxygen;sv mohan reddy;reddyThu, 22 Apr 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు ఆస్పత్రులు అలాగే తెలంగాణలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రజలను వేధిస్తున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రజలను అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్న కొన్ని ఆస్పత్రుల్ విషయంలో ఇప్పుడు అధికారులు అలాగే ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా కూడా దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రముఖులకు చెందిన కొన్ని ఆస్పత్రుల్లో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని కరోనాకు మందు లేకపోయినా సరే అనేక రూపాల్లో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి.

 ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. విజయవాడ గుంటూరు అలాగే విశాఖపట్నం లో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు అన్ని కూడా ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి అని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనితో ఆసుపత్రుల విషయంలో జగన్ ఒక కమిటీని వేసే అవకాశం ఉందని సమాచారం. మాజీ ఆరోగ్య శాఖ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసి దీనికి మంత్రిని చైర్మన్ గా చేసి విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని ఆసుపత్రులకు పర్యటనలు కూడా చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఆక్సిజన్ కొరత సృష్టిస్తున్న ఆసుపత్రుల విషయంలో కూడా జగన్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చు అని తెలుస్తుంది. విజయవాడలో ఉన్న కొన్ని ప్రముఖ ఆసుపత్రులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దీనితో వాటి విషయంలో కూడా జగన్ కఠినంగా వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

 వైసిపి నాయకులు కు చెందిన కొన్ని ఆస్పత్రులు బిజెపి నాయకులకు చెందిన కొన్ని ఆస్పత్రులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి భారీగా వసూలు చేయడం రెండవ దశలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలను భయపెట్టి వసూలు చేయడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవి తేజతో సినిమా గాసిప్స్ విని హరీష్ శంకర్ నవ్వుకున్నాడట....

బన్నీ తీరుతో హర్ట్ అయిన దిల్ రాజు ?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>