MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/ardikavastha-dullc9cfb4b1-1afc-4c8b-ad42-1b833c923ff5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/ardikavastha-dullc9cfb4b1-1afc-4c8b-ad42-1b833c923ff5-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన తరువాత ప్రపంచ దేశాల ప్రజలందరూ ,వారి ఆర్థిక జీవితం కూడా అతలాకుతలమౌతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా డీలా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రమాదంలో పడింది . రోజురోజుకీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. పోయిన సంవత్సరం లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నష్టం నుంచి కోలుకుంటున్న భారత ఎకనామిక్ ,ఇప్పుడు స్థానికంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది . ఈ క్రమంలోనే వైరస్ నియంతARDIKAVASTHA DULL;jeevitha rajaseskhar;tiru;minister;local language;central government;june;paruguమనీ : కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా డీలా పడిపోయిందా..?మనీ : కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా డీలా పడిపోయిందా..?ARDIKAVASTHA DULL;jeevitha rajaseskhar;tiru;minister;local language;central government;june;paruguThu, 22 Apr 2021 11:00:00 GMT
కరోనా వచ్చిన తరువాత ప్రపంచ దేశాల ప్రజలందరూ ,వారి ఆర్థిక జీవితం కూడా అతలాకుతలమౌతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా డీలా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రమాదంలో పడింది . రోజురోజుకీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. పోయిన సంవత్సరం లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నష్టం నుంచి కోలుకుంటున్న భారత ఎకనామిక్ ,ఇప్పుడు స్థానికంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది . ఈ క్రమంలోనే వైరస్ నియంత్రణ సాధ్యం కాకపోతే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

దేశంలో రోజురోజుకు కరోనా  కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఈ పరిణామం కీలక రంగాలలో కూడా ప్రభావితం చేస్తోంది . ఇప్పటికే పర్యాటక, విమానయాన, నిర్మాణ ,ఆతిథ్య, రెస్టారెంట్ ,వినోద , వాహన రంగాలకు కరోనా సెగ తగులుతోంది .ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో అయిన ఏప్రిల్ ,జూన్ లో వృద్ధి రేటు తగ్గే వీలుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు . ఒకవేళ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కరోన తీవ్రత అధికంగా ఉన్నట్లయితే, దేశ ఆర్థిక వ్యవస్థకు  మళ్లీ కష్టాలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక నిన్నమొన్నటిదాకా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది అని , అంచనాలు వేసిన రేటింగ్ ఏజెన్సీలు , కూడా నేడు దేశంలో కరోనాను  చూసి వారి లెక్కలను సవరించుకున్నారు . ఈ ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు సుమారు 13.5 శాతం నుంచి 12.6 శాతానికి దిగివచ్చింది. ఇక జేపీ మోర్గాన్ సైతం 13 శాతం నుంచి 11 శాతానికి పరిమితం అయింది.. వృద్ధిరేటు నిజానికి ఈ స్థాయి తక్కువేం కాదు .అయితే అంచనాలు తిరుగుముఖం పడితే ,అవి మళ్ళీ మైనస్ లోకి జారుకున్నా  ఆశ్చర్యపోనక్కర్లేదు..

ఒకవేళ జూన్ కల్లా కరోన సెకండ్ వేవ్ తగ్గినట్లయితే ,తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది .లేకపోతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ,అందుకే ప్రాణాలను ,జీవనోపాధిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": డేంజరస్ గా మారిన కరోనా.. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులకు కోవిడ్ పాజిటివ్..!!

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>