PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caroanavirusbbdda4fe-c0ab-479a-91c8-8420fb98c9df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caroanavirusbbdda4fe-c0ab-479a-91c8-8420fb98c9df-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి చూస్తూండగానే విశ్వరూపమే ప్రదర్శిస్తోంది. దాన్ని ఏదోలా అదుపు చేయవచ్చు అనుకుంటూ లొంగేలా అసలు కనిపించడంలేదు. కరోనా హాట్ స్పాట్స్ గా రాష్ట్రాలకు రాష్ట్రాలు మారిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవడంలేదు అన్నది రోజురోజుకూ పెరుగుతున్న కరోనా నంబరే చెబుతోంది. caroanavirus;modi;jammu and kashmir - srinagar/jammu;prime minister;central governmentకని కరోనా : కరోనా కట్టడికి అదే మందు...కానీ...?కని కరోనా : కరోనా కట్టడికి అదే మందు...కానీ...?caroanavirus;modi;jammu and kashmir - srinagar/jammu;prime minister;central governmentThu, 22 Apr 2021 09:40:14 GMTకరోనా మహమ్మారి చూస్తూండగానే విశ్వరూపమే ప్రదర్శిస్తోంది. దాన్ని ఏదోలా అదుపు చేయవచ్చు అనుకుంటూ లొంగేలా అసలు కనిపించడంలేదు. కరోనా హాట్ స్పాట్స్ గా రాష్ట్రాలకు రాష్ట్రాలు మారిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవడంలేదు అన్నది రోజురోజుకూ పెరుగుతున్న కరోనా నంబరే చెబుతోంది.

అయితే కరోనా కట్టడి విషయంలో ఏకైక మార్గంగా ఒక్కటే ఉంది అని చెబుతున్నారు. అదే కఠినమైన  లాక్ డౌన్ గా పేర్కొంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కట్టుదిట్టంగా కొన్నాళ్ళ పాటు అయినా లాక్ డౌన్ పెడితే తప్ప కరోనా మహమ్మారి అదుపులోకి రాదు అని అంటున్నారు. అయితే లాక్ డౌన్ గత ఏడాడి రెండు నెలల పాటు ప్రభుత్వం పెట్టింది. దాని వల్ల మంచి ఫలితాలే వచ్చాయి.

కానీ ఆకలి చావులు ఎక్కువ అయ్యాయి. దేశంలో మెజారిటీ ప్రజలు మరింత దారుణంగా దెబ్బ తిన్నారు. ఇక దేశ ఆర్ధిక వ్యవస్థ అయితే పదేళ్ళ వెనక్కు పోయింది. అందువల్లనే ఆర్ధిక నిపుణులు మాత్రం లాక్ డౌన్ పరిష్కారం కాదు అది పెట్టవద్దు అని హెచ్చరిస్తున్నారు. అయితే వైద్య రంగ నిపుణులు మాత్రం కరోనా కట్టడికి లాక్ డౌన్ సరైన మార్గమని అంటున్నారు.

ఈ రెండింటికే ఇపుడు పొత్తు కుదరడంలేదు. కరోనా కారణంగా గత ఏడాది నుంచి దేశమే కాదు, రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా చితికిపోయాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ పెడితే ఇంకా దారుణంగా ఆర్ధిక వ్యవస్థ ఉంటుందని పాలకులు బెంగటిల్లుతున్నారు. ఇక ప్రధాని మోడీ అయితే లాక్ డౌన్ ఆఖరి అస్త్రమే కావాలని అన్నారు. కానీ చూస్తూంటే కరోనా అంత సమయం ఇచ్చేలా లేదు. మరణాలు కూడా దారుణంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ విధించాల్సిందే అన్న మాట అయితే అంతటా ఉంది. మరి లాక్ డౌన్ కనుక పెడితే కరోనా కంట్రోల్ లోకి వస్తుంది. కానీ ఈ దేశం ఆ తరువాత పరిస్థితులను తట్టుకోగలదా. అదే ఇపుడు అందరికీ వేధిస్తున్న ప్రశ్న. ఒక విధంగా ముందు నుయ్యి వెనక గొయ్యిలా సీన్ ఉంది. మరి కేంద్రం ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..

శంకర్ పెడుతున్న పరీక్షలకు ఆలోచనలలో పడ్డ రామ్ చరణ్ !

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>