PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8e40c9f8-5f21-44a0-a399-33bff4425bc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8e40c9f8-5f21-44a0-a399-33bff4425bc1-415x250-IndiaHerald.jpgకరోనా రెండో దశ దారుణంగా కబళిస్తోంది. మొదటి దశ కంటే వేగంగా శక్తివంతంగా ప్రభావం చూపుతోంది. ఈ కరోనా ధాటికి ఎందరో బలవుతున్నారు. వారిలో కరోనాతో నిత్యం పోరాడుతున్న వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది కూడా ఉంటున్నారు. మహారాష్ట్రలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మహారాష్ట్రలో దాదాపు 18వేల మందికి పైగా వైద్యులు కొవిడ్‌ బారిన పడినట్టు తెలుస్తోంది. వారిలో 168మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. తాజాగా ముంబయిలో స్వెరి టీబీ ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టcoronavirus;nithya new;facebook;doctor;tuberculosisకని కరోనా: ఇదే చివరి గుడ్ మార్నింగ్ - కంటతడి పెట్టిస్తున్న వైద్యురాలి పోస్ట్..?కని కరోనా: ఇదే చివరి గుడ్ మార్నింగ్ - కంటతడి పెట్టిస్తున్న వైద్యురాలి పోస్ట్..?coronavirus;nithya new;facebook;doctor;tuberculosisThu, 22 Apr 2021 09:00:00 GMT
తాజాగా ముంబయిలో స్వెరి టీబీ ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మనీషా జాదవ్‌ కరోనాతో కన్నుమూశారు. ఆమె ఓ క్షయవ్యాధి నిపుణురాలు.  మనీషా ఇటీవల కొవిడ్‌ బారిన పడ్డారు. ఆమె తన మరణాన్ని ముందే ఊహించారు. చనిపోయే ముందు ఆమె పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేసిన సందేశం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె ఏం పోస్టు పెట్టారటంటే.. " ‘ఇదే చివరి గుడ్‌ మార్నింగ్‌ కావొచ్చు. ఈ వేదికపై నేను మిమ్మల్ని కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్త. మరణం శరీరానికే. ఆత్మకు కాదు. ఆత్మకు చావులేదు ’’ అని డాక్టర్ మనీషా పోస్ట్ చేశారు.

డాక్టర్ మనీషా.. ఆ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే కన్నుమూశారు. వైద్యులు ప్రస్తుతం అందరి కంటే ఎక్కువగా ప్రమాదకరమైన జోన్‌ లో ఉన్నారు. నిత్యం వైరస్‌తోనే సావాహం చేస్తూ మృత్యువుతో చెలగాటం ఆడుతున్నారు. ముందుగా వ్యాక్సీన్ తీసుకున్నా కొందరు మాత్రం డాక్టర్ మనీషాలా మృత్యువాత పడుతుత్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కొందరు చెబుతున్నారు. అనేకమంది వైద్యులు, ఆరోగ్యం రంగ నిపుణులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని పదేపదే ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.

కరోనా ఉధృతికి చివరకు వైద్యులు కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి. చివరి నిమిషాల్లో తీసుకొచ్చిన పేషెంట్లను చూసి వారు కూడా ఏమీ చేయలేమని అంటున్నారు. కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తామంతా నిస్సహాయులుగా మారిపోయామంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>