PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9363e5cf-24d4-4488-b5ea-ae735e54b18d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9363e5cf-24d4-4488-b5ea-ae735e54b18d-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. మంగళవారం ఒక్కరోజే కొవిడ్ 19 కారణంగానే రాష్ట్రంలో మొత్తం 20 మంది చనిపోయారు. దీంతో ప్రతి గంటకు ఒకరు చనిపోయినట్లు అయింది. ఒక్కరోజే 20 మంది చనిపోవడం ఇప్పటి వరకు రాష్ట్రంలో తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ మరణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,876 మంది మరణించారు. ఐతే అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంcoronavirus;hyderabad;telangana;twitter;oxygen;coronavirusకని "కరోనా": తెలంగాణలో ప్రతి గంటకు ఒకరు మృతి..?కని "కరోనా": తెలంగాణలో ప్రతి గంటకు ఒకరు మృతి..?coronavirus;hyderabad;telangana;twitter;oxygen;coronavirusThu, 22 Apr 2021 10:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. మంగళవారం ఒక్కరోజే కొవిడ్ 19 కారణంగానే రాష్ట్రంలో మొత్తం 20 మంది చనిపోయారు. దీంతో ప్రతి గంటకు ఒకరు చనిపోయినట్లు అయింది. ఒక్కరోజే 20 మంది చనిపోవడం ఇప్పటి వరకు రాష్ట్రంలో తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ మరణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ  1,876 మంది మరణించారు.

" style="height: 570px;">


ఐతే అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బుధవారం రోజు కూడా 23 మంది కరోనా రోగుల చనిపోయారు. బుధవారం ఒక్కరోజే 5, 567 మంది కరోనా బారిన పడ్డారు. సరిగ్గా వారం రోజుల క్రితం టెస్ట్ చేసిన ప్రతి 33 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. కానీ ఇప్పుడు కేవలం 19 మంది లోనే ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. 98 శాతం నుంచి 86.85 శాతానికి రికవరీ రేటు కూడా తగ్గిపోయింది. వారం రోజుల క్రితం రికవరీ రేటు 92% గా ఉండేది కానీ ప్రస్తుతం 86.85% కి పడిపోయింది. మరణ రేటు పెరగడం, రికవరీ రేటు తగ్గటం, పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం వంటివి రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం యాక్టీవ్ కరోనా కేసులు 46,488 ఉన్నాయి.



హైదరాబాద్ సిటీ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 400 నుంచి 500 కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు సింప్టమ్స్ విషయంలో చాలా తేడా ఉందని వైద్య అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా బాధితులకు ఎక్కువగా జ్వరం, పొడి దగ్గు, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, అలసట, వాసన తెలియకపోవడం, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు ఉండేవి కానీ సెకండ్ వేవ్ లో కరోనా రోగులకు ప్రధానంగా శ్వాస ఇబ్బంది మాత్రమే కనిపిస్తోందని చెబుతున్నారు. ఫలితంగా ప్రతి ఒక్క కరోనా రోగికి ఆక్సిజన్ అవసరం అవుతోంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఈ లెక్కలు చూస్తే మీరు తప్పకుండా వ్యాక్సీన్ తీసుకుంటారు..!

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..

శంకర్ పెడుతున్న పరీక్షలకు ఆలోచనలలో పడ్డ రామ్ చరణ్ !

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>