PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-virusdecec3d3-a53a-4901-9cd2-049b3f9eab49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-virusdecec3d3-a53a-4901-9cd2-049b3f9eab49-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ మాస్క్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. మాస్క్ వలన కరోనా కట్టడి అయితే రెండు గజాల దూరం ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఉపయోగం లేదని పైగా ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాదిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కారులో వెళ్లే సమయంలో కూడా కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే అని స్పష్టంగా చెబుతున్నాయి. లేదcorona virus;police;bihar;car;jharkhand;manadesam;coronavirusకారు ప్రైవేట్ అయినా మాస్క్ ఎందుకు...? కరోనా రాకముందు సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం మాస్క్ కారులో ఉండాల్సిందేనా...?కారు ప్రైవేట్ అయినా మాస్క్ ఎందుకు...? కరోనా రాకముందు సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం మాస్క్ కారులో ఉండాల్సిందేనా...?corona virus;police;bihar;car;jharkhand;manadesam;coronavirusThu, 22 Apr 2021 10:53:03 GMTకరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ మాస్క్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. మాస్క్ వలన కరోనా కట్టడి అయితే రెండు గజాల దూరం ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఉపయోగం లేదని పైగా ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాదిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కారులో వెళ్లే సమయంలో కూడా కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే అని స్పష్టంగా చెబుతున్నాయి. లేదంటే మాత్రం విపత్తుల నిర్వహణ చట్టం కింద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని తీర్పులు కూడా ఇస్తున్నారు.

అయితే చాలామందికి కారులో వెళ్లే సమయంలో మాస్క్ ఎందుకు... ప్రైవేట్ కారు కదా అనే ప్రశ్నలు అనుమానాలు ఉన్నాయి  అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలు ఇవ్వడం వెనక సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది అని చెప్పవచ్చు. 2019లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బీహార్ కు చెందిన ఒక కేసు సందర్భంగా బహిరంగ ప్రదేశంలో కారు ఉంటే అది ఖచ్చితంగా వ్యక్తిగతం కాదు అని స్పష్టంగా పేర్కొంది. 2016 లో జార్ఖండ్ నుండి బీహార్ కు వెళుతుండగా ఒక కారును బీహార్ నవాడా జిల్లాలోని సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీ చేశారు.  

కారులో మద్యం గుర్తించారు. కోర్టు కి వెళ్లగా కారు అనేది ప్రైవేట్ అని పబ్లిక్ కాదని చెప్పగా... అది బహిరంగ ప్రదేశంలో ఉంది కాబట్టి వ్యక్తిగతం కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. వాస్తవానికి బీహార్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. ప్రజలు ఎవరైనా సరే ఆ కారు వద్దకు వచ్చే అవకాశం ఉందని కాబట్టి ప్రభుత్వ ఆస్తులు గా పరిగణించే రోడ్లు ఇతర ప్రదేశాలకు మన కారు వెళితే అది కచ్చితంగా బహిరంగ ప్రదేశమే అని దాన్ని వ్యక్తిగతంగా చూడలేము అంటూ సుప్రీం కోర్టు  కేసు సందర్భంగా స్పష్టం చేసింది. అయితే ఈ కేసుపై మనదేశంలో కరోనా రాకముందు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కారు అనేది బహిరంగ ప్రదేశమే కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ డేంజరస్ రికార్డ్..!!

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>