PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-ap-high-court-notices-to-the-center-3de4ea95-3efc-44b1-aa77-23594bdb84bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-ap-high-court-notices-to-the-center-3de4ea95-3efc-44b1-aa77-23594bdb84bd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు అదే విధంగా నమోదు కావడంపై ఏపీ సర్కార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యే రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంది. కరోనా కట్టడికి కేంద్ర సర్కార్ చర్యలు కూడా పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ పై హైకోర్ట్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోవిడ్‌ నియంత్రణ చర్యల పై కౌంటర్‌ దాఖలు చేయకపోవటం పై ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు... ఈనెల 26వ తేదీలోపు కౌంటhigh court,ap;mandula;andhra pradesh;high court;petitioner;lawyer;letter;thota chandrasekhar;central government;kavuru srinivasఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్ఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్high court,ap;mandula;andhra pradesh;high court;petitioner;lawyer;letter;thota chandrasekhar;central government;kavuru srinivasThu, 22 Apr 2021 13:10:41 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు అదే విధంగా నమోదు కావడంపై ఏపీ సర్కార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యే రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంది. కరోనా కట్టడికి కేంద్ర సర్కార్ చర్యలు కూడా పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ పై హైకోర్ట్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోవిడ్‌ నియంత్రణ చర్యల పై కౌంటర్‌ దాఖలు చేయకపోవటం పై ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు... ఈనెల 26వ తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రాధాన్యతా అంశాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు తదితరం అంశాల పై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రవేటు ఆసుపత్రుల పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని హైకోర్టు ఆదేశించింది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన తోట సురేష్‌ బాబు... పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. రెమిడేసీవర్  ఇంజక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టుకు పిటిషనర్‌ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వివరించారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని శ్రీనివాస్‌ వివరించారు. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 27వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే ప్రభుత్వం పై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : గుంటూరులో రెండ్రోజుల్లోనే 92 కరోనా మృతదేహల అంత్యక్రియలు....

కని "కరోనా": ఈ టాబ్లెట్ తో కరోనా 24 గంటల్లోనే మటుమాయం..కానీ...?

బన్నీ తీరుతో హర్ట్ అయిన దిల్ రాజు ?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>