MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-hallsa000067e-001a-49aa-b9e5-a653471aa718-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-hallsa000067e-001a-49aa-b9e5-a653471aa718-415x250-IndiaHerald.jpgతెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని థియేటర్లు బంద్ కానున్నాయి. ఈ మేరకు నిన్న సాయంత్రం సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సినిమాల విషయంలో ఏమి చేయాలి అని ఆలోచించిన అందరూ థియేటర్లు బంద్ చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎనిమిది గంటలకల్లా థియేటర్లు మూసివేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోజుకు రెండు షోలు వేయడానికి మాత్రమే థియేటర్లు అనుమతి ఉంటుంది. మామూలుగా ఫస్ట్ షో 9 గtollywood gossips;amala akkineni;audi;andhra pradesh;telangana;cinema;cinema theater;cinema theatreథియేటర్స్ మూత : తెలంగాణ బాటలోనే ఏపీ కూడా ?థియేటర్స్ మూత : తెలంగాణ బాటలోనే ఏపీ కూడా ?tollywood gossips;amala akkineni;audi;andhra pradesh;telangana;cinema;cinema theater;cinema theatreWed, 21 Apr 2021 07:00:00 GMTతెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని థియేటర్లు బంద్ కానున్నాయి. ఈ మేరకు నిన్న సాయంత్రం సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సినిమాల విషయంలో ఏమి చేయాలి అని ఆలోచించిన అందరూ థియేటర్లు బంద్ చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎనిమిది గంటలకల్లా థియేటర్లు మూసివేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోజుకు రెండు షోలు వేయడానికి మాత్రమే థియేటర్లు అనుమతి ఉంటుంది. మామూలుగా ఫస్ట్ షో 9 గంటలకు పూర్తవుతుంది, ఆ తర్వాత 9:30 9:45 నుంచి సెకండ్ షో మొదలవుతుంది. 

కానీ నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తే ఉదయం షో అలాగే మధ్యాహ్నం రెండు గంటల షో మాత్రమే థియేటర్లలో ఆడించే అవకాశం ఉంటుంది. అలా రెండు షోలతో థియేటర్ లు నడిపే కంటే థియేటర్లు మూసివేయడం కరెక్ట్ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే వకీల్ సాబ్ సినిమా తప్ప మరో సినిమా ప్రస్తుతానికి థియేటర్లలో ఆడడం లేదు. ఈ సినిమా కూడా విడుదలై దాదాపు పన్నెండు రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కలెక్షన్లలో చాలా డ్రాప్ కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వకీల్ సాబ్ సినిమా థియేటర్ లో ఆడుతుందనీ ఆ సినిమా మినహాయించి మిగతా అన్ని థియేటర్లు బంద్ చేయాలని తెలంగాణ సినిమా థియేటర్ యజమానుల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ ధియేటర్లో సంఘం కూడా ఇదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అలాంటి ఆలోచనలు లేకపోయినా ఆడించడానికి సరైన సినిమా ఒకటి లేదు. తెలంగాణలో థియేటర్లు బంద్ చేస్తే కేవలం ఆంధ్ర వరకు సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. కొత్త సినిమాలు లేకపోతే థియేటర్లకు ప్రేక్షకులే వచ్చే అవకాశం ఉండదు. దీంతో అక్కడ కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>