MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adipurusha8e6f876-b313-4189-aa39-ca7f448145b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adipurusha8e6f876-b313-4189-aa39-ca7f448145b0-415x250-IndiaHerald.jpgప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులే. ఇక ఆ భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి "ఆదిపురుష్". ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్ 30 శాతం పూర్తి చేసుకుందని దర్శకుడు ఓం రౌత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉండగా పౌరాణిక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెకుతోంది కాబట్adipurush;prabhas;pooja hegde;saif ali khan;ramu;india;adinarayanareddy;bollywood;cinema;interview;posters;v;chitram"ఆదిపురుష్" లుక్ అలా ఉండదట..!"ఆదిపురుష్" లుక్ అలా ఉండదట..!adipurush;prabhas;pooja hegde;saif ali khan;ramu;india;adinarayanareddy;bollywood;cinema;interview;posters;v;chitramWed, 21 Apr 2021 08:07:01 GMTప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులే. ఇక ఆ భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి "ఆదిపురుష్". ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్ 30 శాతం పూర్తి చేసుకుందని దర్శకుడు ఓం రౌత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉండగా పౌరాణిక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెకుతోంది కాబట్టి "శ్రీరామనవమి" పండగ పోస్టర్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు అనుకుంటున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ చిత్రయూనిట్ సర్ప్రైజ్ చేస్తుందేమోనని అభిమానులు భావిస్తున్నారు. 

అంతే కాకుండా   సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నందున లుక్ పై కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. రామాయణం ను బేస్ చేసుకుని వచ్చిన సినిమాల్లో రాముడి లుక్ లాగే ప్రభాస్ లుక్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కానీ  దర్శకుడు ఓం రౌత్ మాటలు వింటుంటే మాత్రం ప్రభాస్ లుక్ అందుకు భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నింటిలో ప్రభాస్ బాణం పట్టుకుని...నీలి వర్ణంలో కనిపిస్తారు. కానీ ఆదిపురుష్ రాముడు అలా ఉండదట. ఇదిలా ఉండగా ఈ భారీ బడ్జెట్ సినిమాను టీసిరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. అంతే కాకుండా రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో జ‌రుగుతుండ‌గా క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో అక్క‌డ లాక్ డౌన్ విధించారు. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. దాంతో ప్ర‌భాస్ హైద‌రాబాద్ చేరుకున్నారు. అంతే కాకుండా ప్ర‌భాస్ ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన‌బోతున్నట్టు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా బిజెపిలో అలజడి... ఏం జరుగుతుంది...?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>